Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Sarkaru Vaari Paata: మళ్లీ మారిన రిలీజ్ డేట్.. మహేశ్‌కు కలిసొచ్చిన రోజున రాబోతుందట
కొంత కాలంగా హిట్లు మీద హిట్లు కొడుతూ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ జోష్‌తోనే వరుసగా ఎన్నో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అంతేకాదు, ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇక, ఇప్పుడు ఈ స్టార్ హీరో 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ విడుదల తేదీ మరోసారి మారిపోయిందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

సర్కారు వారి పాట పాడుతున్నాడు
ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
చరణ్, తారక్‌ను కలపడంపై పెదవి విప్పిన రాజమౌళి.. మూవీలో ఇద్దరి రోల్స్.. ఫ్యాన్స్ గొడవలపై షాకింగ్‌గా!

మూవీ స్టోరీ అలా.. మహేశ్ రోల్ ఇలా
'సర్కారు వారి పాట' మూవీ బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ రూపొందుతోంది. హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతాడు. అప్పుడు హీరో.. తన తండ్రి నిజాయితీని నిరూపించేందుకు విలన్‌ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ అంటున్నారు. ఇక, ఇందులో వింటేజ్ మహేశ్ బాబును చూపిస్తారని అంటున్నారు.

రిలీజ్‌కు ముందే రికార్డులు కొట్టేసి
కొద్ది రోజుల క్రితం 'సర్కారు వారి పాట' నుంచి టీజర్ విడుదలైంది. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ 24 గంటల్లోనే 23.06 మిలియన్ వ్యూస్‌ను, 7 లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకుంది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కరోజులో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్‌గా టాలీవుడ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది.
Disha Patani: దారుణమైన సెల్ఫీతో షాకిచ్చిన హీరోయిన్.. ఏకంగా షార్ట్‌ను కిందకు జరిపి మరీ!

షూటింగ్ అప్‌డేట్.. ఇంకా చాలానే
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతూ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ఫారెన్ షెడ్యూల్‌ను జరుపుకుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా షూట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ షూట్ చేశారు. ఇలా ఇప్పటి వరకూ ఈ మూవీ షూటింగ్ 60 శాతం మాత్రమే పూర్తైందని తెలుస్తోంది.

సర్కారు వారి పాట మళ్లీ వాయిదా
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో దీన్ని ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అయితే, ఇప్పుడు మహేశ్ బాబు మోకాలికి సర్జరీ చేయించుకోబోతున్నాడు. దీంతో ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
హీరోయిన్ బాత్ వీడియో షేర్ చేసిన వర్మ: దాని కంటే హాట్‌గా ఉన్నావ్.. ఫారెస్ట్ ఎక్కడ అంటూ!

అప్పటికి మార్చారని అంటున్నారు
'సర్కారు వారి పాట' మూవీ వాయిదా పడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే కొత్త రిలీజ్ డేట్ గురించి కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేస్తారట. ఆరోజునే మహేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన 'పోకిరి' సినిమా విడుదలైంది. అందుకే సూపర్ స్టార్ కూడా ఆరోజున రిలీజ్ చేసేందుకు ఓకే చెప్పేశాడట.