twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ ‘సారొచ్చారు’ టాకేంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మాస్ మహరాజ రవితేజ, కాజల్ అగర్వాల్, రీచా గంగోపాధ్యాయ్ హీరో హీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన 'సారొచ్చారు' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. చాలా కాలంగా సరైన హిట్ లేని రవితేజకు...ఈ చిత్రం కూడా పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. అయితే గత ప్లాపు చిత్రాలతో పోల్చుకుంటే ఫర్వాలేదు, ఓకే అనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది.

    ఈ రోజు విడుదలైన ఈ చిత్రం మిక్స్ డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రవితేజ రోటీన్ అవతారంలో కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్ తో దర్శనం ఇచ్చాడు. అయితే ఇది మాస్ ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో క్లాస్ ప్రేక్షకులు కూడా రవితేజ క్యారెక్టర్‌పై ఏమంత తృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు.

    సినిమా స్టోరీ లైన్ ఓకే కానీ...స్క్రీన్ ప్లే విషయంలో ప్రేక్షకులను మెప్పించ లేక పోయాడనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ అందరినీ డిస్పప్పాయింట్ చేస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లాజిక్ లేని సీన్లు కూడా సినిమాలో బాగానే ఉన్నాయి. అయితే సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. దేవిశ్రీ అందించిన సంగీతం ఫర్వాలేదు. విజయ్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మరి తొలి రోజు ఇలాంటి టాక్ నేపథ్యంలో తుది ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

    రవితేజ, కాజల్‌, రిచా గంగోపాధ్యాయ, జయసుధ, చంద్రమోహన్‌, రవిప్రకాష్‌, యం.ఎస్‌.నారాయణ, శ్రీనివాసరెడ్డి, కల్పిక తదితరులు నటించని ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, సంస్థ : త్రీ ఏంజిల్స్ స్టూడియో, సమర్పణ : వైజయంతి మూవీస్, నిర్మాత : ప్రియాంక దత్, కథ, స్క్రీన్ ప్లు, మాటలు, దర్శకత్వం : పరశురామ్.

    English summary
    
 Sarocharu movie gets mixed response. Ravi Teja in a very different avatar. There are some genuinely good moments in the movie, but a badly botched up climax and some big loopholes in the plot let down the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X