»   » 'సరైనోడు': రీషూట్ వెనక అసలు సీక్రెట్ ఇదే..

'సరైనోడు': రీషూట్ వెనక అసలు సీక్రెట్ ఇదే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న సరైనోడు చిత్రం రీషూట్ పెట్టిన సంగతి తెలిసిందే. చిత్రంలో కొన్ని సన్నివేశాలు ...రెండు రోజులు షూటింగ్ చేసి యాడ్ చేసి, కొన్ని సీన్స్ ని ఎడిట్ చేసి తొలిగించనున్నారు. ఇప్పటికే సెన్సార్ నుంచి ఎ సర్టిఫికేట్ అందుతున్న ఈ చిత్రంలో ఏ సీన్స్ రీషూట్ చేస్తారు..అనేది చర్చనీయాంశంగా మారింది.

అందుతున్న సమాచారం ప్రకారం..ఈ రీషూట్ ని చిరంజీవో మరొకరో చెప్పింది కాదని చెప్తున్నారు. సెన్సార్ బోర్డ్ వారు చెప్పిన సూచన మేరకే రీషూట్ చేస్తున్నట్లుచెప్పుకుంటున్నారు. తాము ఈ చిత్రంలోని కొన్ని హై ఓల్టేజ్ సన్నివేశాల్లో ఉండటంతో "A"సర్టిఫికేట్ తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చిందని, కొన్ని సీన్స్ ఎడిట్ చేస్తూ..మరికొన్ని రీషూట్ చేస్తే "U/A"ఇవ్వటానికి తమకేని అభ్యంతరం లేదని చెప్పినట్లు సమచారం.


Sarrainodu’s action scenes toned down

దాంతో అల్లు అర్జున్, బోయపాటి శ్రీను డిస్కస్ చేసుకుని శాటిలైట్ రైట్స్ కు సమస్య రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. "A" సర్టిఫికేట్ ఉన్న సినిమాలతో శాటిలైట్ రైట్స్ కు సమస్య ఉంది. మళ్లీ ఛానెల్ వాళ్లు రీ సెన్సార్ చేయించాలి. అయితే "U/A" ఇస్తే కనుక ఆ సమస్య రాదు. అంతేకాదు"A" తో ఫ్యామిలీ ఆడియన్స్ అండ మిస్సవుతుంది. ఇవన్నీ ఆలోచించే ..రీషూట్ పోగ్రాం పెట్టుకున్నట్లు చెప్తున్నారు.

English summary
Allu Arjun and Boyapati Srinu have decided to re-shoot a few scenes after the Censor Board gave it a “A” certificate.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu