»   » అఖిల్ హీరోయిన్ కు మెగా క్యాంప్ నుంచి పిలుపు

అఖిల్ హీరోయిన్ కు మెగా క్యాంప్ నుంచి పిలుపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖిల్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన సాయేషా సైగల్ కు ఇప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజిలో డిమాండ్ ఏర్పడింది. ఆమెను తమ ప్రక్కన నటింపచేయాలని యంగ్ హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. మెగా క్యాంప్ నుంచి కూడా ఆమెకు ఆహ్వానం అందిందని సమాచారం. అల్లు అర్జున్,బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఒక హీరోయిన్ గా ఆమెను ఎంపిక చేసే అవకాసం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
https://www.facebook.com/TeluguFilmibeat

భారతీయ చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరైన దిలీప్ కుమార్ మనవరాలు సాయేషా సైగల్ త్వరలో తెలుగు తెరపై సందడి చేయడానికి సిద్దమయ్యింది. అక్కినేని అఖిల్ పరిచయ చిత్రంలో ఈ ముంబై ముద్దుగుమ్మను హీరోయిన్ గా ఎంపిక చేశారు. గత రెండు రోజుల నుండి ఈ అమ్మాయి ఫోటోల కోసం యువత ఇంటర్నెట్లో తెగ వెతుకుతున్నారు. ఇక్కడి ప్రేక్షకులకు సాయేషా సైగల్ బాగా నచ్చింది.

Sayesha Saigal enters in Mega Camp?

వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సరసన నటించడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాను. ఆడిషన్ చేయకుండానే నన్ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. వినాయక్ గారికి నేను బాగా నటించగలను అనే నమ్మకం. ఎందుకంటే నటీనటుల కుటుంబం నుండి వచ్చాను కదా..! నా తల్లిదండ్రులు షహీన్, సుమిత్ సైగల్ సైతం హిందీలో మంచి పేరున్న నటులు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తాను అనే నమ్మకం ఉంది. ఎక్కువ ప్రెజర్ ఫీలవ్వడం లేదు. అని సాయేషా సైగల్ తెలిపింది.

ఇక అల్లు అర్జున్ కొత్త చిత్రం విషయానికి వస్తే...

అల్లు అర్జున్‌ ఓ ప్రేమకథలో నటించబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కబోతోంది. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ఇద్దరు కథానాయికలతో ఆడిపాడబోతున్నారు. మార్చిలో సినిమాని ప్రారంభించి, ఏప్రిల్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ''బోయపాటి శ్రీను తయారు చేసిన కథ నాకూ, బన్నీకి బాగా నచ్చింది. అందుకే మా గీతాఆర్ట్స్‌లో ఈ సినిమా చేయాలని నిర్ణయించాం. హీరోయిజంతో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బన్నీ స్టైల్‌కి తగ్గట్టుగానే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు దర్శకుడు. ఇందులో నటించే కథానాయికలు, ఇతర సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామ''న్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''అల్లు అర్జున్‌ శైలికి తగ్గట్టుగా కథని సిద్ధం చేశాను. ఇందులో ఆయన కొత్తగా కనిపిస్తార''న్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, మాటలు: ఎం.రత్నం

English summary
Buzz is,Sayesha Saigal is considered by mega camp for Allu Arjun's next under the direction of Boyapati Srinu. Geeta Arts is producing the film.
Please Wait while comments are loading...