»   » రాజకీయ హస్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం వెనుక దాగి ఉన్న రహాస్యాలు !?

రాజకీయ హస్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం వెనుక దాగి ఉన్న రహాస్యాలు !?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీరంగ ప్రముఖులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖుల హాజరైన పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ప్రారంభోత్సవానికి చిరంజీవి గైర్హాజరు కావడం తెలిసిందే తన తనయుడు రామ్ చరణ్ తేజ్ జన్మదినాన్ని దగ్గరుండి జరిపించేందుకు చిరంజీవి ఆస్ట్రేలియా వెళ్లడం నిజమే అయినప్పటికీ 27న బర్తడే జరిపించేసి ఈ ఓపినింగ్ హాజరయ్యే అవకాశం ఉండి కూడా, ఈ కార్యక్రమానికి చిరు డుమ్మా కొట్టడం సినీ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమవుతోంది.

ఒక సామాన్య హాస్యనటుడిగా ఇండస్ట్రీకి వచ్చిన గణేష్..పవన్ కళ్యాణ్, రవితేజ(ఆంజనేయులు)లతో చిత్రాలను చేసేంత ఎప్పుడు, ఏలా సంపాదించాడు అనే విషయం బయటకు లాగితే అసలు ఈ చిత్రానికి నిర్మాత మంత్రి బోత్స అని క్లియర్ గా అర్థమయింది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి అన్నీ తానై సతీసమేతంగా వ్యవహరించిన బోత్స అంతకు ముందే పవన్ తో సినిమా చేయాలని తెలిపిన విషయం తెలిసిందే అయితే ప్రత్యేక సెగల మద్య పవన్ తో సినిమా చేసి ఏలా లాభ పడాలి అని లోచించిన బోత్స రీసెంట్ గా తెలంగాణకు సపోర్ట్ చేసి మాట్లాడి కేసిఆర్ నుండి కూడా ప్రశంసలు అందుకున్నాడు.

అంతే కాదు ఈ ప్రారంభోత్సవానికి అన్ని పార్టీలకు చెందిన పలువురు ప్రఖులతో పాటు తెలంగాణ ను కోరుతున్న వారు కూడా సంతోషంగా పాల్గొనడం పవన్ తో మనసు విప్పి మాట్టాడటం చూస్తుంటే ఇదంతా బోత్స తెరవెనుక కథ అని లాగులేసుకొనే వాడికి కూడా అర్థం అవుతుంది. తన హీరోకి తన సినిమాకి ఇప్పటి నుండి తెలంగాణ సపోర్ట్ తీసుకున్న బొత్స మరి దాసరిని ఎందుకు పిలిచాడు పిలవగానే వచ్చి ఎన్నడూ లేనంతగా పవన్ కళ్యాణ్ ను కౌగిలించుకుని మరి ఆశీస్సులు ఇవ్వడం వెనుక ఏదో సామాజిక రాజకీయం జరుగుతుందని క్లియర్ గా అర్థం అవుతుంది.

ఏదీ ఏమైనా తమ అభిమాన హీరో సినిమాకు ఇంతమంది నాయకులు రావడంతో ఇక్కడ అభిమానులు కూడా ఒక అర్థం చెబుతున్నారు. చిరు స్థానాన్ని పవన్ కైవసం చేసుకుంటున్నాడు. అందుకే బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు వీరంతా పవన్ చుట్టూ చేరుతున్నారనీ వారు అనుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X