For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sekhar Kammula - Dhanush స్టోరీ లైన్ లీక్... షేక్ చేసే కధతో ప్రేక్షకుల ముందుకు?

  |

  తమిళ సూపర్ స్టార్ ధనుష్ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే తమిళంలో సూపర్ స్టార్ కృష్ణ తెచ్చుకున్న ఆయన ఇప్పుడు ట్రై లింగ్యువల్ సినిమాలు కాకుండా అటు బాలీవుడ్ మరో పక్క హాలీవుడ్లో కూడా నటిస్తూ తనకంటూ ప్రత్యేక సంపాదించే పనిలో పడ్డారు. శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్ లో ఒక ట్రై లింగ్యువల్ సినిమా కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించబడిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ లీక్ అయింది. అయితే ఆ స్టోరీ లైన్ ఆసక్తికరంగా సాగుతుండటంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  ధనుష్-శేఖర్ కాంబో

  ధనుష్-శేఖర్ కాంబో

  దర్శకుడు శేఖర్ కమ్ములకి మంచి పేరుంది. అభిరుచి కలిగిన సినిమాలు తీస్తాడని ఏ మాత్రం హింసకు, మాస్ ఎలిమెంట్స్ కు తావు ఇవ్వకుండా సింపుల్ గా సినిమాలు చేస్తాడని ఆయన గత సినిమాలు చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. అనుకోకుండా అనామిక అంటూ ఒక హారర్ మూవీ ప్రయోగం చేసినా అది ఆయనకు వర్కౌట్ కాకపోవడంతో మళ్ళీ తన పాత స్టైల్ లోకి వచ్చి ఏ మాత్రం ఫైట్స్ కి, మాస్ ఎలిమెంట్స్ లేకుండా చాలా క్లాసిక్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే అనూహ్యంగా తమిళంలో సూపర్ స్టార్ క్రేజ్ సంపాదించిన ధనుష్ శేఖర్ కమ్ముల సినిమా చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు.

  కధ లీక్

  కధ లీక్

  నిజానికి దాదాపు ధనుష్ నటిస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతున్నాయి. ఆ లెక్కన ధనుష్ కి టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన చేత ఇలా ఒక సినిమా చేయిస్తే దానిని తమిళంతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయవచ్చని ప్లాన్ చేశారు. అలాగే ధనుష్ కి ఉన్న మాస్ ఇమేజ్ మరోపక్క శేఖర్ కమ్ముల క్లాస్ ఇమేజ్ రెండు కలిపి ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతూ పెడుతున్నాయి. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా అనే ప్రకటించకుండా ట్రై లింగ్యువల్ మూవీ అని ప్రకటించి రచ్చ రేపారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కథ లీక్ అయింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

  లీకయిన కధ ఏంటంటే

  లీకయిన కధ ఏంటంటే

  లీక్ అయిన కథ ప్రకారం ఈ సినిమా ఇప్పటిది కాదని ఒక పీరియాడిక్ మూవీ అని అంటున్నారు. మద్రాసు రాజధానిగా తమిళ, తెలుగు ప్రజలు అందరూ కలిసి ఉన్న రోజుల్లో మద్రాసులో జరిగిన ఒక కథ తెరకెక్కించబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ రోజుల్లో నిజంగా జరిగిన కథను ఇప్పుడు తెరకెక్కిస్తున్నారా ? లేక అప్పటి నేపథ్యాన్ని తీసుకుని కల్పిత కథను సృష్టించారో అనే విషయం మీద మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. సినిమా విడుదలయ్యాక మాత్రమే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికిఇక మెయిన్ కథ ఇదేనని గతంలో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తమిళ రాజకీయాలకు సంబంధించిన రియల్ కథ ఆధారంగా కథను సేకరించినట్లు ప్రచారం జరిగింది.

  డబుల్ రేమ్యునరేష్

  డబుల్ రేమ్యునరేష్

  ఇక ఈ సినిమా కోసం ధనుష్ ఏకంగా 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈ సినిమా మార్కెట్ పెద్దది కావడం ఎక్కువ డేట్స్ కూడా కేటాయించాల్సి రావడంతో ఆయన డబుల్ ఛార్జ్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. నిజానికి ధనుష్ చివరిగా నటించిన జగమే తంత్రం సినిమా 17 భాషల్లో 190 దేశాల్లో రిలీజైంది. ఈ సినిమా కోసం ఆయన 15 కోట్లే తీసుకోగా శేఖర్ సినిమా కోసం దానికి డబుల్ ఛార్జ్ చేసినట్లు సమాచారం.

  వెంకటేష్ కూడా

  వెంకటేష్ కూడా

  ఇక ఈ సినిమాలో తెలుగు నుంచి స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు టాక్ కూడా వచ్చింది. ఆయన మరెవరో కాదు వెంకటేష్ అని ఆ మధ్య ఊహాగానాలు వచ్చాయి. దానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. అదేంటంటే గతంలో రానా అరణ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన కమ్ముల అక్కడ వెంకటేష్ ను కలిసి ఒక కథ విషయంలో మాట్లాడాల్సి ఉందని అన్నారని, స్టేజ్ పై కూడా మీతో వర్క్ చేయాలని ఉందని చెప్పారని టాలీవుడ్ వర్గాల టాక్. అప్పటి నుంచే ఈ పుకారు మొదలయిందని చెప్పచు.

  Most Awaited Movies Love Story , Kgf chapter 2 Updates || Filmibeat Telugu
  ఆమె ఫిక్స్

  ఆమె ఫిక్స్

  ఇక సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక రిస్క్ లేకుండా దర్శకుడు మరోసారి సాయి పల్లవిని ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదివరకే ఫిదా సినిమాతో హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ లవ్ స్టోరీ సినిమాతో కూడా అదే తరహాలో హిట్ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవు, ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ నెల నుంచి సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాని నారాయణ దాసు రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  English summary
  The story of Dhanush Shekhar Kammula has been leaked. There is a propaganda that a story is going to be told in Madras in the days when all the Tamil and Telugu people are together as the capital of Madras.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X