»   » శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మహేష్ బాబు?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మహేష్ బాబు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు సున్నితమైన కథాంశాలతో ఆహ్లాదకరమైన సినిమాలు తెరకెక్కించే శేఖర్ కమ్ములతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా శేఖర్ కమ్ముల చెప్పిన స్టోరీ లైన్ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో ‘గోదావరి' సినిమా మహేష్ తోనే తీయాలనుకున్న శేఖర్ కమ్ముల పరిస్థితులు అనుకూలించక పోవడంతో సుమంత్ తో తీయాల్సి వచ్చింది. ‘బ్రహ్మోత్సవం' తర్వాత ఈ కాంబినేషన్ తెరకెక్కే అవకాశం ఉంది.

మహేష్ బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు' ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసామని ప్రకటించింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Mahesh Babu

ఇంకా ఆడియో కూడా రిలీజ్ కాని ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో గట్టి పోటీ నెలకొందట. ఫైనల్‌గా ‘శ్రీమంతుడు' శాటిలైట్ రైట్స్‌ని సుమారు 10 కోట్ల రూపాయలకి జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం' చిత్రంలో నటించబోతున్నారు.

English summary
Sources say that Sekhar Kammula-Mahesh Babu movie will take off when Mahesh completes his commitments.
Please Wait while comments are loading...