»   » రాణా చిత్రం...ఒకే దెబ్బకు రెండు పిట్టలు

రాణా చిత్రం...ఒకే దెబ్బకు రెండు పిట్టలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాణా, సెల్వరాఘవన్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం కోసం లొకేషన్స్ వెతుకులాట ప్రారంభమైంది. సురేష్ బాబు నిర్మించే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో ఉంటుందని తమిళంలోనూ ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే సురేష్ బాబు పూర్తి బడ్జెట్ భరించకుండా ఓ తమిళ నిర్మాతతో కూడా టై అప్ అయ్యి ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారని వినపడుతోంది. అక్కడ సెల్వరాఘవన్ కు ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవచ్చు. తన కొడుకుని తమిళంకు పరిచయం చేసుకోవచ్చనేది సురేష్ బాబు ఆలోచన అని చెప్తున్నారు. ఈ పేరు పెట్టని చిత్రంలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని పరిచయం చేయనున్నారు. అందుకోసం సెల్వరాఘవన్ క్రిందటి వారం కొంత మంది బాలీవుడ్ హీరోయిన్స్ ని కలిసి ప్రపోజల్ పెట్టారు. అలాగే ఇక్కడ లోకల్ గా ఎవరైనా అమ్మాయి ఉన్నా ఫరవాలేదంటూ ఓ ప్రకటన కూడా ఇచ్చి వచ్చిన రెస్యూమ్ లను పరిశీలుస్తున్నారు. ఇప్పుడు ఇండియా మొత్తం తిరిగి ఎవరూ షూట్ చేయని అందమైన కొత్త లొకేషన్స్ అన్వేషించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రాణా..ద్విపాత్రలలో కనిపిస్తారని అంతటా వినపడుతోంది. అలాగే మ్యూజిక్ డైరక్టర్ జీవీ ప్రకాష్ అప్పుడే పని ప్రారంభించారు. రామానాయుడు పూర్తిగా ఈ చిత్రాన్ని దగ్గరుండి పర్యవేక్షించనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu