For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డ్రెస్ కాంట్రవర్సీలో 'షాడో' హీరోయిన్

  By Srikanya
  |

  హైదరాబాద్: వెంకటేష్, తాప్సీ కాంబినేషన్ లో మెహర్ రమేష్ రూపొందిస్తున్న చిత్రం 'షాడో'. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా మధురిమ చేస్తోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ కి జంటగా కనిపించే మధురిమ రీసెంట్ గా డ్రెస్ కాంట్రవర్శిలో ఇరుక్కుంది. ఆమె పాల్గొన్న హాట్ ర్యాంప్ వాక్ లో ఆమె ఈ తరహా డ్రస్ వేసుకుని కనిపించింది. ఆ డ్రెస్ పై ఆమె బుద్దుడు ఉండటం వివాదానికి దారి తీసేసట్లు ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోప్రక్క ఇలా డ్రెస్ లపై జనం ఆరాధించే వ్యక్తుల లేదా దేవతల బొమ్మలు వేయటం వారిని వ్యక్తిగతంగా అవమానించటమే అని మండిపడుతున్నారు.

  ఇక 'షాడో' విషయానికి వస్తే.... ఈ చిత్రం బడ్జెట్ ఇప్పటికే 30 కోట్లు రీచైందని ఫిల్మ్ నగర్ సమాచారం. భారీగా సినిమాలు తీసే దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రం కోసం బాగా ఖర్చుపెట్టించాడని అంటున్నారు. మొదట అనుకున్న దానికన్నా ఈ మొత్తం చాలా ఎక్కువ అని, అయితే యాక్షన్ ఎపిసోడ్స్, ఫారిన్ లొకేషన్స్ సినిమా బడ్జెట్ ని పెంచుకుంటూ వెళ్ళిపోయాయని అంటున్నారు. మార్చి 28 విడుదల తేదీ ప్రకటించినా ఇప్పుడు ఆ తేదీ మారే అవకాసముంది.

  వెంకటేష్ మాట్లాడుతూ.. ''మంచి చిత్రం రూపొందాలంటే ప్రతిభ ఉన్న బృందం అవసరం. అలాంటి జట్టుతో చేస్తున్నదే 'షాడో' చిత్రం. నాలోని ఎనర్జీని చక్కగా వాడుకుని తెరపై కొత్తగా ఆవిష్కరించారు దర్శకుడు. కుటుంబంతో కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మంచి చిత్రం చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది ''' అన్నారు .నేను ఇప్పటి వరకూ పోషించిన పోలీస్‌ పాత్రలకు భిన్నంగా ఈ చిత్రంలో నా పాత్ర ఉంటుంది. వెంకటేష్‌తో నేను కలిసి నటించిన ప్రతి చిత్రం మంచి విజయం సాధించింది అన్నారు శ్రీకాంత్‌. శ్రీకాంత్‌, మధురిమ ప్రధాన పాత్రధారులు. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. పరుచూరి శివరామ్‌ప్రసాద్‌ నిర్మాత.

  దర్శకుడు మాట్లాడుతూ ''పగ, ప్రతీకారం నేపథ్యంగా సాగే కథ ఇది. టైటిల్‌ సాంగ్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. సినిమాకి వెన్నెముక లాంటి పాత్రను శ్రీకాంత్‌ ఈ చిత్రంలో పోషించారు''అన్నారు. నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్‌, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్‌, రావురమేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్‌, గోపిమోహన్‌. మాటలు: కోనవెంకట్‌, మెహర్‌ రమేష్‌. సంగీతం: తమన్‌. కెమెరా: ప్రసాద్‌, మూరెళ్ల, ఎడిటింగ్‌, మార్తాండ్‌, కె.వెంకటేష్‌. ఆర్ట్‌: ప్రకాష్‌ ఏ ఎస్‌. ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి. అజరుకుమార్‌ వర్మ.

  English summary
  The long legged beauty “Madhurima” who is acting in a special role in Shadow has been a special attraction in a recently conducted event and had a Hot Ramp walk at Art-De Arahant – Art Exhibition by Pooja Kapur at Muse Art Gallery . Her look with new art theme was very trendy and she was hotter than ever before , but what irked few of the observers was the way the art of Buddha imbibed on the saree of the lady.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X