»   » ఒకే హోటల్లో మాజీ లవర్స్ షాహిద్-కరీనా

ఒకే హోటల్లో మాజీ లవర్స్ షాహిద్-కరీనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కరీనా కపూర్ మధ్య ఒకప్పుడు ఎంత ఘాటు లవ్వాయనం జరిగిందో కొత్తగా చెప్పక్కర్లేదు. అప్పట్లో వీళ్లిద్దరి సీక్రెట్ ముద్దు సీన్లు నెట్‌లో హల్ చల్ సృష్టించాయి. ఏమైందో ఏమోగానీ ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం కరీనా..సైఫ్ అలీఖాన్ తో సహజీవనం చేస్తుంటే, షాహిద్ నెలకో గర్ల్ ఫ్రెండ్ ను మారుస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

అయితే తాజాగా ఇద్దరూ ఢిల్లీ గుర్గావ్ లోని ఒకే హోటల్ లో దిగారు. కొంపతీసి ఇద్దరి మధ్య మళ్లీ 'సం"బంధం కలిసిందేమో అనుకునేరు. అస్సలు కాదు. తమ తాజా సినిమాల ప్రమోషన్ లో భాగంగా వచ్చారంతే. షాహిద్ కపూర్-సోనమ్ కపూర్ జంటగా నటిస్తున్న 'మౌసం" సినిమాను ప్రమోట్ చేయడానికి షాహిద్ వస్తే, సల్మాన్ ఖాన్ బాడీగార్డు సినిమా ప్రమోషన్ లో భాగంగా కరీనా ఈ హోటల్ కు చేరుకుంది.

ఈ మాజీ లవర్స్ కలిసి మాట్లాడుకుంటారేమో అని హోటల్ సిబ్బంది భావించినా అలాంటిదేమీ జరుగలేదు. ఇద్దరి రూమ్స్ వేర్వేరు ఫ్లోర్లలో ఉండటంతో ఇద్దరూ కనీసం ఎదురుపడే అవకాశం కూడా రాలేదు.

English summary
Shahid and Kareena will be in Delhi with Sonam Kapoor and Salman Khan, to promote "Mausam" and "Bodyguard".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu