»   » 47 ఏళ్ల వయసులో మళ్లీ షారుక్ తండ్రి కాబోతున్నాడా?

47 ఏళ్ల వయసులో మళ్లీ షారుక్ తండ్రి కాబోతున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై : బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ మరో సారి తల్లిదండ్రులు కావాలనే ఆలోచనలో ఉన్నారా? మూడో బిడ్డకు జన్మనివ్వాలనే ఆలోచనలో ఉన్నారా? అటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ మీడియా కథనాలు. ఇప్పటికే వీరికి 15 ఏళ్ల వయసున్న కుమారుడు ఆర్యన్, 13 ఏళ్ల వయసున్న కూతురు సుహానా ఉన్నారు.

తాజాగా వీరు మూడో బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నారని.....ఇందుకోసం సర్రోగెన్సీ పద్దతిని ఫాలో అవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సర్రోగెన్సీ పద్దతి అనగా అద్దెగర్భం. షారుక్ వీర్యకణాలు, గౌరీ అండం ద్వారా పుట్టే బిడ్డను వేరొక మహిళ గర్భంలో పెంచడం అన్నమాట.

ఈ విధానంలో ఇప్పటికే అమీర్ ఖాన్, అతని భార్య కిరణ్ రావు ఓ బిడ్డను కన్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ చిన్నతమ్మడు సొహైల్, అతని భార్య సీమా ఈ పద్దతిలోనే రెండో బిడ్డను కన్నారు. ఈ విధానంలో సక్సెస్ ఫుల్ గా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు బిడ్డను కన్న నేపథ్యంలో షారుక్-గౌరీ కూడా అదే పద్దతిలో మూడో బిడ్డను కనాలనే యోచనలో ఉన్నారట.

పలు జాతీయ మీడియా సంస్థలు షారుక్-గౌరీ మూడో బిడ్డ విషయమై కథనాలు వెలువరించాయి. మరి షారుక్-గౌరీ స్వయంగా ఈ విషయమై స్పందిస్తే తప్ప ఈ వార్తల్లో వాస్తవం ఏమిటో తేలనుంది.

English summary
Bollywood superstar Shahrukh Khan and wife Gauri are going to be parents for the third time, according to a report published in Mid-Day paper.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu