»   » షకలక శంకర్ ఆ రోజు కనపడలేదే? మీడియా ధైర్యం చేయలేదు

షకలక శంకర్ ఆ రోజు కనపడలేదే? మీడియా ధైర్యం చేయలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా షకలక శంకర్ ని పవన్ కళ్యాణ్ సెట్లో కొట్టాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులు తర్వాత షకలక శంకర్ సర్దార్ సెట్లో అలాంటిదేమీ జరగలేదని, పవన్ ఎదురుగా ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే మందలించేవారని, ఆయన దేముడని అని ఆ విషయాన్ని తగ్గించే ప్రయత్నం చేసాడు.

అయితే రీసెంట్ గా జరిగిన ఆడియో పంక్షన్ లో షకలక శంకర్ ఎక్కడా కనపడలేదు. కావాలనే షకలక శంకర్ మీడియాకు, కెమెరాలకు దూరం వెళ్ళారా లేక ఆడియో పంక్షన్ కు అసలు రాలేదా అనే అనుమానాలు ఇప్పుడు అంతటా వినిపిస్తున్నాయి.

Also Read: తేలింది: పవన్ కొట్టింది ఈ కమిడియన్ నే? కుళ్లు జోక్స్, కామెంట్స్ కారణం

Shakalaka Shankar stay away from audio launch?

అయితే కొందరు మాత్రం పవన్ స్ట్రిక్టుగా షకలక శంకర్ ని షూటింగ్ కు, ఆడియో పంక్షన్ కు దూరంగా ఉండమని చెప్పాడని అందుకే షకలక శంకర్ కనపడలేదని అంటున్నారు. ఈ విషయమై మళ్లీ కొద్ది రోజుల తర్వాత మీడియాతో మాట్లాడి క్లారిఫై చేస్తారేమో చూడాలి.

ఇక మొన్న ఆడియో పంక్షన్ కు ముందు రోజు జరిగిన ప్రెస్ మీట్ లో పవన్ ని మీడియా వారు ఈ ప్రశ్న అడుగుదామని ప్రిపేర్ అయ్యారట. అయితే ఆ సమయంలో పవన్ ని అడిగే ధైర్యం చెయ్యలేకపోయారని చెప్పుకుంటున్నారు. అంతేకదా షకలక శంకర్ ని అడిగినట్లుగా పవన్ ని ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ అడగలేరుగా...

English summary
Shakalaka Shankar absence at the audio launch of 'Sardaar Gabber Singh'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu