»   » జూ ఎన్టీఆర్ శక్తి ఆడియో ఫంక్షన్‌పై అభిమానులలో నెలకొన్న సందిగ్దత

జూ ఎన్టీఆర్ శక్తి ఆడియో ఫంక్షన్‌పై అభిమానులలో నెలకొన్న సందిగ్దత

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ, ఆతర్వాత జూనియర్ ఎన్టీఆర్ మేము నందమూరి అభిమానులం అంటూ చెప్పకోదగ్గ విధంగా సినిమాలలో నటించివారి అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడున్న యువ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్‌ది ప్రత్యేకమైన శైలి. రికార్డ్స్ బ్రేక్ చేసినటువంటి సినిమాలలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ ఈసంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి శక్తి నివ్వడానికి ఎక్కవ వ్యయంతో శక్తి లాంటి సినిమాని తన అభిమానులకు అందించనున్నారు.

ఈసంవత్సరం నందమూరి అభిమానులుకు పండగ జరుపుకోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి యంగ్ టైగర్ పెళ్శి. రెండవది తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డుల్ని బద్దలు చేయడానికి తన శక్తిని చూపించడానికి వస్తున్న శక్తి సినిమా. కానీ శక్తి సినిమా ఆడియో ఫంక్షన్ కార్యక్రమం గురించి నందమూరి అభిమానులలో కొంత సందిగ్దత వాతావరణం నెలకొంది. దానికి కారణం నందమూరి ప్యాన్స్ వెబ్ సైట్‌లు కొన్ని శక్తి సినిమా ఆడియో ఫంక్షన్ నిన్న అంటే బుధవారం ఆడియో కార్యక్రమం అయిపోయిందంటూ వార్తలు రాయడంతో పైవిధంగా జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు.

మరి కోన్ని వెబ్ సైట్స్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ శక్తి సినిమా ఆడియో ఫంక్షన్ కార్యక్రమం మాత్రం ఈ నెల 27వ తేదీన నందమూరి అభిమానుల మద్యన హైదరాబాద్ లోని లలిత కళాతోరణంలో నిర్వహించనున్నారని వార్తలు రాశాయి. ఐతే ఈరెండిటిలో ఏది నిజం అనేది అర్దం కాక అభిమానులలో కోంత సందిగ్దత వాతావరణం నెలకొంది. ఇది మాత్రమే కాకుండా నిన్న రాత్రి సడన్‌గా శక్తి ఆడియో ఫంక్షన్ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్లేసు కూడా మార్పుచేయడం జరిగిందని మరో రూమర్ వచ్చింది.

ఏది ఏమైనప్పటికీ శక్తి సినిమా ఆడియో విడుదల ఎక్కడ జరుగుతుందనే అఫీసియల్ ఎనౌన్స్ మెంట్ మాత్రం అధికారకంగా నిర్మాత అశ్వినిదత్, డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంతవరకు వెల్లడించలేదు. శక్తి ఆడియో విడుదల కార్యక్రమానికి ఇక రెండు రోజులే ఉండడంతో నందమూరి అభిమానులు ఒకింత ఎగ్జైట్మెంట్‌కి లోనవుతున్నారని సమాచారం.

English summary
But situations are turned chaotic when some Nandamuri fans websites published the news about 'Shakti' audio release yesterday. Few days ago, it was announced grandly on 'Shakti' audio release event to be held on 27th of this month at Lalitha Kala Thoranam, Hyderabad but since yesterday night there was a strange buzz in Nandamuri fans about change of the venue at final moment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu