»   » జూ ఎన్టీఆర్ 'శక్తి' చిత్రం విడుదల వాయిదా!?

జూ ఎన్టీఆర్ 'శక్తి' చిత్రం విడుదల వాయిదా!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మార్చి 30వ తేదీన విడుదల కావాల్సిన జూ.ఎన్టీఆర్ తాజా చిత్రం 'శక్తి' విడుదల వాయిదా పడేటట్లు ఉందని సమాచారం. ఈ సినిమాను ఏప్రియల్ 7 గానీ 8 వ తేదీకి గానీ మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఫోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాలేదు. ముఖ్యంగా చిత్రంలో సింహ భాగం ఆక్రమించే గ్రాఫిక్స్ కు బాగా లేటవుతోందని, రాత్రింబవళ్ళు పనిచేసినా అనుకున్న టైమ్ కి పూర్తి అయ్యేటట్లు లేదని చెప్తున్నారు. అయితే నిర్మాత అశ్వనీదత్ మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ చిత్రాన్ని అనుకున్న టైమ్ కే విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నట్లు చెప్తున్నారు. ఇక సోషియో పాంఠసి చిత్రంగా శక్తి పీఠాల నేఫధ్యంలో రూపొందే ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా అభివర్ణిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానా చేస్తోంది.

అలాగే 'శక్తి' చిత్రంలో బాలీవుడ్ నటి పూజా బేడీ ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... శక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద బడ్జెట్ చిత్రం. ఇందులో నాకు సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. ఈజిప్టు యువరాణిగా నేను అలరిస్తాను అన్నారామె. ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్టులు,గ్రాఫిక్స్ అధ్బుతంగా ఉంటాయని అన్నారామె. ఎన్టీఆర్..ఈ చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉందనీ, ఇదొక పవర్ ఫుల్ కథ అనీ అంటున్నారు తన కెరీర్ లోనే ఇది సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్తున్నారు.ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.

English summary
Jr NTR’s upcoming film "Shakti" release date may postpone to April 7th it seems. Earlier the movie was stated to release on March 30th, but now as per the latest reports the release date might postpone to April 7th due to the graphic works.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu