»   » వర్మ చిత్రంలో 'అడ్డా' హీరోయిన్

వర్మ చిత్రంలో 'అడ్డా' హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shanvi set to join RGV-Mohan Babu’s film
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకుడుగా,మోహన్ బాబు నిర్మాతగా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'అడ్డా' హీరోయిన్ శాన్విని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె మంచు విష్ణు సరసన చేస్తోంది. ఆమె పాత్ర కూడా కథకు కీలకమని చెప్తున్నారు. త్వరలోనే ఆమె షూటింగ్ లో పాల్గొననుంది. మొదట ఈ పాత్రకు గానూ రెజీనాను అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆమె సీన్ లోకి వచ్చింది.

ఈ చిత్రానికి 'ఒట్టు' అనే టైటిల్ పెట్టారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ టైటిల్ కాకుండా 'అన్నగారు' అనే టైటిల్ ని పెడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు మోహన్ బాబు కూడా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదని చెప్పారు. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కామెడీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

మోహన్ బాబు మాట్లాడుతూ... రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాం. నా పోర్షన్ షూటింగ్ అయిపోయింది. విష్ణు పోర్షన్ నడుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఫస్ట్‌కాపీ ఇస్తానన్నాడు వర్మ. అలాంటి డైరెక్టర్‌ని ఇంతదాకా నేను చూడలేదు. డైరెక్షన్ తప్ప అతనికి వేరే ధ్యాసే ఉండదు. విష్ణు కెరీర్‌లో బెస్ట్ సినిమాగా ఇస్తానని చెప్పాడు. అందులో నేను, విష్ణు తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాం. 'అన్నగారు', 'రెస్పెక్ట్', 'ఒట్టు' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి కానీ ఇంకా నిర్ణయించలేదు. నేను, వర్మ కలిసి చేస్తున్నామంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోందని మాకు తెలుసు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నాం అన్నారు.

మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. మోహన్ బాబు ఊరి పెద్దగా పెద రాయుడు టైపులో ఈ పాత్ర ఉంటుందని చెప్పుకుంటున్నారు.
ఇక అయితే ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డ విష్ణు....వర్మ దర్శకత్వంలో సినిమా ఒప్పుకోవడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వర్మ స్వార్థానికి విష్ణు బలి కాబోతున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వర్మ ఒకప్పుడు గొప్ప దర్శకుడే, ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమాలు తీసిన దర్శకుడే అయినప్పటికీ.....ఈ మధ్య ఆయన మైండ్ సెట్ పూర్తిగా మారిందని, ప్రేక్షకుల అభిరుచికి విలువ ఇవ్వకుండా తన స్వార్థానికి...ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను టార్చర్ పెడుతున్నాడని, అందుకు ఇటీవల వచ్చిన ఆయన సినిమాలే నిదర్శనమని అంటున్నారు.

English summary

 Shanvi is all set to team up with Vishnu Manchu in RGV’s upcoming film. After a long time, RGV is said to be making an action comedy and both Mohan Babu and Manchu Vishnu are quite excited about the project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu