»   » శర్వా 'ఎక్స్ ప్రెస్ రాజా' కథ ఇదేనా..?

శర్వా 'ఎక్స్ ప్రెస్ రాజా' కథ ఇదేనా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదల కానున్న శర్వానంద్ చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా'. ఈ చిత్రం Snatch(2000) అనే హాలీవుడ్ చిత్రం బేస్ చేసుకుని రూపొందిందని సమాచారం. శర్వానంద్, సురభి జంటగా యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఓ కుక్క చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం కథ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఉన్న కథను మీకు అందిస్తున్నాం.

అందుతున్న సమాచారం ప్రకారం ...శర్వానంద్ తన ఫ్రెండ్ ప్రభాస్ శ్రీను తో కలిసి డబ్బు సంపాదించుకోవటానికి వస్తాడు. అక్కడ అతను సురబి అనే యానిమల్ లవర్ తో ప్రేమలో పడతాడు. మరో ప్రక్క విలన్ గ్యాంగ్ ఒకటి...జనాలను ఛారిటీ పేరుతో మోసం సంపాదించిన 75 కోట్ల డబ్బుని ఓ డైమండ్ గా మార్చి... ఓ కుక్క మెళ్లో వేస్తారు.


మరో ప్రక్క హీరోయిన్ సురభికు కుక్కలంటే ప్రాణం. ముఖ్యంగా ఆమె పెట్ డాగ్ ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేదు. శర్వానంద్ మాత్రం ఆ కుక్క అంటే అసహ్యం. సురభినీ ప్రేమంచే శర్వాకి, కుక్కకు మద్య ఎప్పుడూ గొడవ జరుగుతూంటుంది. అయితే అనుకోకుండా ఓ రోజు ఆ కుక్క మిస్సవుతుంది. దాంతో ఆ కుక్క మిస్సింగ్ కు కారణం శర్వానే అంటుందామే.


Sharvanand's Express Raja Storyline

దాంతో దాన్ని వెతికే నిలో పడతాడు. ఈ లోగా.. ఆ కుక్కను వెతికే ప్రాసెస్ లో చాలా పాత్రలు వస్తాయి. వాళ్లంతా కూడా ఈ కుక్కనే వెతుకుతూంటారు. దానికి కారణం ఏమిటనేది శర్వాకు అర్దం కాదు. ఈ లోగా ఈ కుక్క మెడలో ఉన్న డైమండ్ కోసం కుక్కను వెతుకుతున్నారనే విషయం తెలుస్తుంది. ఫైనల్ గా ఆ కుక్కను ఎలా పట్టుకుని ఆమె ప్రేమను శర్వా గెలుచుకున్నాడనే కోణంలో కథ నడుస్తుంది.


ఈ పైన చెప్పిన కథ అంతా వింటేజ్ పాయింట్ అనే చిత్రం చెప్పినట్లు ముక్కలు ముక్కలుగా ఎవరి పాయింటాఫ్ వ్యూలో వారిదే అన్నట్లు కథనం జరుగుతూంటుందని తెలుస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది... అసలు కథ ఇదేనా వంటి విషయాలు తెలియాలంటే రేపు రిలీజ్ అవుతున్న సినిమా చూడాల్సిందే.

English summary
Here is the story line of Sharwanand's Express Raja film according to a little birdie in Filmnagar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu