»   »  కేశినేని నానితో కలిసి శర్వానంద్

కేశినేని నానితో కలిసి శర్వానంద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సంక్రాంతికి 'ఎక్స ప్రెస్ రాజా' అంటూ ప్రేక్షకులకి వినోదం అందించిన హీరో శర్వానంద్. ఈ చిత్రం విజయం తర్వాత అతనికి డిమాండ్ రెట్టింపు అయ్యింది. అయితే శర్వానంద్..మాత్రం విజయవాడ ఎమ్.పి అయిన కేశినేని నాని, ప్రారంబించబోతున్న కొత్త సంస్థలో చేయబోయే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ఇచ్చినట్లు సమాచారం.

ఇక ఈ చిత్రాన్ని మహేష్ .పి డైరక్ట్ చేయనున్నారు. మహేష్ .పి గతంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన రా..రా..కిృష్ణయ్య సినిమాకు డైరక్టర్ చేసారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు, అయినా ఇతను తెచ్చిన స్క్రిప్టు నచ్చి చాన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది.

 Sharwanand's next film with Kesineni Nani

ఇక ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నడవనుందని తెలుస్తోంది. గత చిత్రం రారా కృష్ణయ్య..ఓ బాలీవుడ్ చిత్రానికి నకలు గా తయారై వివాదాలని మోసుకు వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటివేమీ లేని విధంగా స్క్రిప్టుని ఓకే చేసినట్లు చెప్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కనుంది. ఈమేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది.

English summary
Director Mahesh P made debut with Ra Ra Krishnayya's new script is liked by Sharwanand and has given his dates from March this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu