ఉపాసన కోసం కొత్త అవతారం ఎత్తనున్న శర్వానంద్.. మునుపెన్నడూ లేని విధంగా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసన కామినేని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ వేర్వేరు రంగాల వారికి చెందిన వారైనా సరే కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఏర్పడిన పరిచయం వారి వివాహం వరకు వెళ్ళింది. అయితే ఉపాసన రామ్ చరణ్ కి అన్ని విషయాల్లో అండగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటూ వస్తోంది. ఇప్పుడంటే రాంచరణ్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు సొంతంగా నిర్వహించుకుంటున్నారు కానీ కొన్నాళ్ళ క్రితం వరకు ఆయనకు సంబంధించిన అన్ని అప్డేట్స్ ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది.
ఇక అపోలో హాస్పిటల్ కి సంబంధించి కీలక బాధ్యతలు వ్యవహరిస్తున్న ఆమె వైద్య సేవలకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అందరినీ ఉత్తేజపరుస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆరోగ్య రంగానికి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా నడుపుతున్న ఆమె ఇప్పుడు కరోనా సమయంలో డాక్టర్లు అందిస్తున్న సేవలకు సంబంధించి ఒక షార్ట్ ఫిలిం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. డాక్టర్లు, వైద్య సిబ్బంది ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ ఎన్ని ఇబ్బందులు పడుతోంది తెలియజేస్తూ ఈ షార్ట్ ఫిలిం ఉండబోతోందని అంటున్నారు.



Click it and Unblock the Notifications











