For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శేఖర్ కమ్ముల ఆ రోజే హీరోల ఫ్యాన్స్ కు కౌంటర్?

  By Srikanya
  |

  హైదరాబాద్ : రీసెంట్ గా శేఖర్ కమ్ముల....మహేష్ బాబు నేనొక్కడినే చిత్రం పోస్టర్ వివాదంలో సమంతకు సపోర్టు చేయటం,పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీపై కొన్ని ప్రశ్నలు సంధించటం వంటివి చేసారు. అయితే ఆయన కామెంట్స్ పై ఆ హీరోల అభిమానుల నుంచి నిరసనలు,రకరకాల కామెంట్స్ వచ్చాయి. అయితే వాటికి సమధానం చెప్తూ ఆయన మళ్ళీ స్పందించలేదు. ఈ నేపధ్యంలో ఆయన ఈ నెల 22 న స్టేజిపై ఆ కామెంట్స్ కు తనదైన శైలిలో ఘాటుగా సమాధానం చెప్పనున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ రోజు తన తాజా చిత్రం 'అనామిక' ఆడియోను వినూత్నరీతిలో విడుదల చేయనున్నారు. ఇంతకీ ఆయన అసలు ఆ విషయం మాట్లాడతారా లేదా అన్నది తెలియాలంటే ఆ రోజు వరకూ వరకూ వెయిట్ చేయాల్సిందే.

  నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అనామిక'. హిందీలో విజయవంతమైన 'కహానీ' సినిమా ఆధారంగా రూపొందుతోంది. అక్కడ విద్యాబాలన్‌ పోషించిన పాత్రలో ఇక్కడ నయనతార నటిస్తోంది. వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఎండమోల్‌ ఇండియా, లాంగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సెన్సార్ ఇప్పటికే పూర్తైంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.

  Shekar Kammula's Anamika’s audio launch on April 22

  ఇక తనదైన శైలిలో చిత్రాలు రూపొందిస్తూ ఓ వర్గం ప్రేక్షకులకు అభిమాన దర్శుడుగా ఎదిగిన శేఖర్ కమ్ములకు మేడే(మే 1 వ తేదీ) పరీక్షగా నిలవనుంది.లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం పరాజయంతో వెనకబడిన శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రం 'అనామిక' ని చాలా కాలంగా ముస్తాబు చేస్తున్నారు. ఇది పునర్మాణ చిత్రం కావటంతో హిట్టైనా శేఖర్ కమ్ములకు పెద్దగా కలిసివచ్చేది లేకపోయినా ...తేడా చేస్తే మాత్రం రీమేక్ కూడా చేయలేకపోయాడనే అపవాదు మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఈ సినిమాను తెలుగు,తమిళ భాషల్లో మే 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ''భర్తను వెతుక్కొంటూ ఓ యువతి హైదరాబాద్‌ నగరంలో చేసిన పోరాటమే ఈ సినిమా. ఆమె ప్రయత్నం ఫలించిందా లేదా అనేది కీలకాంశం. 'కహానీ' కథకు పలు మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. ''అన్నారు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. కీరవాణితో పని చేయడం శేఖర్‌కి ఇదే ప్రథమం. అనామిక చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసరాల్లో సాగుతోంది. ఈ చిత్రంలో వైభవ్‌ పోలీసు కానిస్టేబుల్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ కథలో కీలకమైన పాత్ర ఇది.

  ''పెళ్త్లెన ఓ మహిళ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆమె ఎవరి కోసం అన్వేషణ ప్రారంభించింది? జీవితంలో ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంది? అనే విషయాలు ఆసక్తికరం. ఎం.ఎం.కీరవాణి స్వరాలు చిత్రానికి బలాన్నిస్తాయి''అని నిర్మాత చెబుతున్నాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌.

  English summary
  The audio of Sekhar Kammula’s upcoming film Anamika is going to be launched in a grand way on April 22 in Hyderabad. Sekhar Kammula - Nayanatara's 'Kahaani' remake, 'Anaamika' is getting ready for release. The film has been censored with 'U/A' and the release date will be announced after Tamil version also gets censored. The film is likely to come in May 1st in both Telugu & Tamil.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X