twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శిరిడి సాయి'నిర్మాతతో నాగార్జున సీక్రెట్ డీల్??

    By Srikanya
    |

    హైదరాబాద్ : షిర్డీసాయిగా నాగార్జున నటించిన శిరిడీ సాయి చిత్రం నిన్న(గురువారం)విడుదల అయిన సంగతి తెలిసిందే. బాబా సచరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం విషయంలో నాగార్జున ఆ చిత్ర నిర్మాతతో ఓ సీక్రెట్ డీల్ కుదుర్చుకుని చేసారని వినిపిస్తోంది. ఫిల్మ్ నగర్ లో వినపడుతున్న ఆ ఎగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రాన్ని నాగార్జున,రాఘవేంద్రరావు,కీరవాణి రెమ్యునేషన్స్ తీసుకోకుండా ఐదున్నర కోట్ల రూపాయల బడ్జెట్ లో పూర్తి చేయాలని ఉంది. ఆ మొత్తం తిరిగి వెనక్కి వచ్చాక ఆ చిత్రం లాభాల్లో షేర్ తీసుకోవాలని నిర్ణయం అని చెప్తున్నారు.

    అందుకనే సినిమా ని ఎక్కువగా రాఘవేంద్రరావు రెగ్యులర్ స్కీమ్ లు అయిన పెద్ద పెద్ద సెట్స్ వేయించకుండా రూరల్ ఏరియాల్లో తీసి బడ్జెట్ కంట్రోలులో పెట్టారని చెప్పుకుంటున్నారు. అయినా ఎక్కడా క్వాలిటీ చెడకుండా దర్శకేంద్రుడి సీనియార్టి ఉపకరించిందని చెప్తున్నారు. అలాగే దర్శక,నిర్మాతలు ఊహించినట్లుగానే మొదటి రోజు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసిందని దాంతో ఇక వచ్చేది తాము తీసుకోబోయే లాభాలు వాటాలేనని చెప్తున్నారు. ఇక ఈ ప్రపోజల్ పెట్టింది నాగార్జున అని సమాచారం.

    హీరోలంతా ఇలా తమ ప్రాజెక్టులపై నమ్మకంతో రెమ్యునేషన్స్ పణంగా పెట్టి సినిమాలు చేస్తే మంచి అవుట్ పుట్ వస్తుందని,ఈ విషయంలో నాగార్జునని ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. ఇక 'శిరిడి సాయి' చిత్రాన్ని 801 థియేటర్లలో విడుదలచేసారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్నాటక, సౌత్‌ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, దుబాయి, న్యూజిలాండ్‌, యు.ఎస్‌. తదిరత ప్రాంతాల్లోకూడా విడుదల చేసారు. చాలా చోట్ల విడుదలకు ముందే థియేటర్లు శుభ్రపరచి, బాబా విగ్రహాలను ఏర్పాటు చేసారని సమాచారం .

    నాగార్జున ఈ చిత్రం గురించి చెబుతూ ''బాబా జననం నుంచి జీవ సమాధి వరకూ ఉన్న అన్ని దశలనూ స్పృశించాం. నేటి తరంలో ఎంతోమంది సాయిబాబా బోధనలపై విశ్వాసం కలిగి ఉన్నారు. అందరికీ నచ్చేలా రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. సినిమాకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది''అన్నారు.

    English summary
    
 Nagarjuna’s Shirdi Sai is released grandly worldwide yesterday. Producer A. Mahesh Reddy has released the movie in 801 theatres. As per the inner reports, Mahesh Reddy has just invested Rs. 5.5 crores budget on the film. As per the secret deal, producer requested director K. Raghavendra Rao to wind up the project in Rs. 5.5 crores package without paying any remuenrations to Nagarjuna and Keeravani before the release. But, he promised them to take shares in the profit which will be distributed between director, Nag and Keeravani.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X