»   » మై గాడ్.. చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ బడ్జెట్ లెక్క, బాహుబలిని మించేలా.. రాజమౌళి ధైర్యం ఏంటబ్బా!

మై గాడ్.. చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ బడ్జెట్ లెక్క, బాహుబలిని మించేలా.. రాజమౌళి ధైర్యం ఏంటబ్బా!

Subscribe to Filmibeat Telugu

బాహుబలితో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రపంచం మొత్తం బాహుబలి చిత్రం గురించి చర్చించుకుంది. రాజమౌళి ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కించబోయే చిత్రం ఆ స్థాయిలో ఉండదని అంచనా వేశారు. రాంచరణ్, ఎన్టీఆర్ తో మల్టి స్టారర్ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కింకిబోతున్నాడని వార్తలు వచ్చాక తనశైలిలో కమర్షియల్ చిత్రం తెరకెక్కించబోతున్నాడని వార్తలు వచ్చాయి.

#RRR: Rajamouli R Sentiment for Heroines

ఈ మధ్యనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడిప్పుడే ఈ చిత్రానికి సంబందించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట ఈ చిత్రం 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్ర బడ్జెట్ సినీవర్గాలని ఆస్చర్యంలోకి నెట్టే విధంగా ఉంది.

ప్రాజెక్ట్ #ఆర్ఆర్ఆర్

ప్రాజెక్ట్ #ఆర్ఆర్ఆర్

రాజమౌళి తెరకెక్కించబోయే రాంచరణ్, ఎన్టీఆర్ మల్టి స్టారర్ చిత్రం #ఆర్ఆర్ఆర్ పేరుతో ట్రెండ్ అవుతోంది. రాజమౌళి ఈ చిత్రానికి సంబందించిన పనులని చక్కబెట్టే పనిలో జక్కన్న ఉన్నాడు.

 టాలీవుడ్ తొలి భారీ మల్టీస్టారర్

టాలీవుడ్ తొలి భారీ మల్టీస్టారర్

భారీ బడ్జెట్ లో రూపొందుతోన్న తొలి టాలీవుడ్ మల్టీస్టారర్ చిత్రం ఇదే. ఈ చిత్రంలో రాజమౌళి మరో మారు జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు.

బడ్జెట్ లెక్క అదిరిపోయిందిగా

బడ్జెట్ లెక్క అదిరిపోయిందిగా

తాజాగా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం #ఆర్ఆర్ఆర్ చిత్ర బడ్జెట్ షాక్ ఇచ్చే విధంగా ఉంది. ఒక్కసారిగా చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఈ చిత్రం 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పెరిగిపోయిన ఆసక్తి

పెరిగిపోయిన ఆసక్తి

250 కోట్ల బడ్జెట్ అంటూ వార్తలు వస్తుండడంతో అసలు రాజమౌళి ఏ తరహా చిత్రం తీయబోతున్నాడు అనే ఆసక్తి సినీవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. బాహుబలి చిత్రం ఫాంటసీ కథగా రూపొందింది. ఇప్పుడు జక్కన్న చరణ్, ఎన్టీఆర్ తో ఈతరహా ప్రయోగం చేయబోతున్నాడు అంటూ సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

 రాజమౌళి ధైర్యం ఏంటి

రాజమౌళి ధైర్యం ఏంటి

బాహుబలి చిత్రం కూడా భారీ బడ్జెట్ లో రూపొందింది. కానీ ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందడంతో భారీ వసూళ్లు సాధించింది. ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ చిత్రం ఒక భాగంగానే రూపొందుతోంది. ఈ చిత్రానికి 250 కోట్ల బడ్జెట్ పెట్టె దైర్యం చేశాడంటే జక్కన్న బలమైన కథతో రాబోతున్నాడని అంటున్నారు.

అక్టోబర్ లో ప్రారంభం

అక్టోబర్ లో ప్రారంభం

ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియాలంటే ప్రారంభం అయ్యే వరకు ఆగాల్సిదే. అక్టోబర్ లో ఈ చిత్రం మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Shocking budget for Ram Charan and NTR multistarrer movie. RRR movie will starts from October
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X