»   » పవన్ షాకింగ్ లుక్...అందుకోసమేనా?

పవన్ షాకింగ్ లుక్...అందుకోసమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్‌ కొత్త షాకింగ్ లుక్‌ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యంలో పడేసి,సంచలనమై వార్తల్లో నిలిచింది. మామూలుగా గెడ్డం లేకుండా కనిపించే పవన్‌ ఇప్పుడు గెడ్డం పెంచి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తెల్లని దుస్తులు, నల్లగా మెరిసిపోతున్న గుబురు గెడ్డం వెరసి ఓ యోగిలా కనిపిస్తున్నాడు పవన్‌. ఈ లుక్‌ సినిమా కోసమే అని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

పవన్‌ సినిమా 'గబ్బర్‌ సింగ్‌ 2' త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఆ సినిమా కోసమే పవన్‌ లుక్‌ మార్చే పనిలో పడినట్టు తెలుస్తోంది. పవన్‌ సన్నిహితులు మాత్రం 'ఏదో క్యాజువల్‌గానే ఆయన గెడ్డం పెంచారు. సినిమా కోసం కాకపోవచ్చు' అంటున్నారు. మరోవైపు పవన్‌ కోసం పలు కథలు సిద్ధమవుతున్నాయి. 'గబ్బర్‌ సింగ్‌ 2' స్క్రిప్టు పనులు చురుగ్గా సాగుతోంటే, మరోవైపు దర్శకుడు డాలీ కూడా పవన్‌ కల్యాణ్‌ కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Shocking New Look Of Pawan Kalyan

ఈ లుక్ ఎలా బయిటకు వచ్చిందంటే...

పవన్‌కల్యాణ్‌ను ఖమ్మంకు చెందిన బాలిక శ్రీజ ఈరోజు కుటుంబసమేతంగా హైదరాబాద్‌ వచ్చి కలిసింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడి కోలుకున్న శ్రీజ ఈ రోజు పవన్‌కల్యాణ్‌ కార్యాలయానికి తల్లిదండ్రులు, సోదరితో కలిసి వచ్చింది. రెండు గంటలపాటు పవన్‌ శ్రీజ కుటుంబసభ్యులతో గడిపారు. పలు విషయాలు వారితో చర్చించారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను గతంలో పవన్‌కల్యాణ్‌ వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. పవన్‌కల్యాణ్‌ను చూడాలన్న శ్రీజ ఆకాంక్ష గురించి మేక్‌ ఎ విష్‌ ఫౌండేషన్‌ ద్వారా తెలుసుకున్న పవన్‌ ఆస్పత్రికి వెళ్లి శ్రీజను పరామర్శించారు.

'గబ్బర్‌సింగ్‌ 2' విశేషాలకు వస్తే...

మరోసారి గబ్బర్‌సింగ్‌ అవతారంలో ప్రేక్షకుల్ని అలరించేందుకు రంగం సిద్ధం చేసుకొన్నారు పవన్‌ కల్యాణ్‌. ఆయన హీరోగా తెరకెక్కనున్న 'గబ్బర్‌సింగ్‌ 2' చిత్రీకరణ మే తొలి వారంలో మొదలుకానుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'గబ్బర్‌సింగ్‌ 2'లో అనీషా ఆంబ్రోస్‌ హీరోయిన్ గా నటించబోతోంది. కథరీత్యా మరో హీరోయిన్ కూ చోటుందని సమాచారం. ఆ హీరోయిన్ మరెవరో కాదు...త్రిష అని తెలుస్తోంది.

Shocking New Look Of Pawan Kalyan

ఈ మేరకు ఆమెను సంప్రదించారని చెప్పుకుంటున్నారు. అయితే కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని యూనిట్ అభిప్రాయపడుతోందని మతరో ప్రక్క వార్తలు వినపడుతున్నాయి. ఈ విషయమై ప్రొడక్షన్ టీమ్ కామెంట్ చేయటానికి ఇష్టపడటం లేదు. త్వరలోనే ఆ హీరోయిన్ ఎవరనేది తేల్చి అఫీషియల్ గా మీడియాకు స్టేట్ మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

'నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది...' అంటూ 'గబ్బర్‌సింగ్‌'లో పవన్‌ చేసిన సందడి ఇంటిల్లిపాదికీ నచ్చింది. ఆ చిత్రం విడుదలైన వెంటనే దానికి కొనసాగింపుగా మరో సినిమా చేయడంపై మొగ్గు చూపారు పవన్‌. తన సొంత సంస్థ పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌పై నిర్మించేందుకు సన్నద్ధమయ్యారు.

స్వయంగా స్క్రిప్టు పనుల్ని పర్యవేక్షిస్తూ సినిమాను ప్రారంభించారు. అయితే రకరకాల కారణాల వల్ల ఆ చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు అన్నీ ఓ కొలిక్కి రావడంతో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

శరద్ మరార్ మాట్లాడుతూ... ''స్క్రిప్టు పని జరుగుతోంది. భారీ సినిమా కాబట్టి, కావలసిన అంశాలను పక్కాగా ఖరారు చేసుకుంటున్నాం. దర్శకుడు బాబీ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అంతా సిద్ధం కాగానే షూటింగ్ ప్రారంభ తేదీ అధికారికంగా ప్రకటిస్తాం'' అని శరత్‌మరార్ వివరించారు.

అలాగే 'గబ్బర్‌సింగ్ 2' స్క్రిప్టు విషయంలో పవన్ కల్యాణ్ పూర్తిగా లీనమైపోయారట. దర్శకుడికి సలహాలు, సూచనలిస్తూ స్క్రిప్టు పకడ్బందీగా రావడానికి సాయపడుతున్నారని చెప్పుతున్నారు. వాస్తవానికి, మీడియాలోని వార్తల నేపథ్యంలో ముందుగా షూటింగ్ మొదలుపెట్టి, కొద్ది రోజులు జరిపి, ఊహాగానాలకు తెర దించాలనే ప్రతిపాదన కూడా వచ్చిందని, కానీ, పవన్ మాత్రం అలా వద్దనీ, పూర్తి స్క్రిప్టుతో, లొకేషన్లను కూడా పక్కాగా నిర్ణయించుకొని ఏకధాటిగా షూటింగ్ జరుపుదామనీ దర్శక, నిర్మాతలకు నచ్చజెప్పినట్లు చెప్తున్నారు.

అలాగే గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో సినిమా చేస్తానంటూ పవన్ చెప్పిన మాట నిజమే కానీ, దానికీ ఈ 'గబ్బర్ సింగ్2'కూ సంబంధం లేదని చెప్పుకొచ్చారు. మొత్తానికి, 'గబ్బర్ సింగ్2' ఆగినట్లేననీ, 'గోపాల గోపాల...' దర్శకుడు డాలీని స్క్రిప్టుతో రమ్మనమని కోరింది ఈ సినిమాకేననీ వస్తున్న వార్తలు తప్పని తేలింది. అంటే... 'గబ్బర్ సింగ్2' బాబీతో ఉన్నట్లే అని తేలింది. అయితే చిత్ర రెగ్యులర్ షూటింగ్ కోసం మాత్రం మరికొద్ది కాలం వేచి చూడక తప్పదు.

'పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తాడని తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. ఆయన ఐడియాలజీ సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి.

గబ్బర్ సింగ్-2 చిత్రం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ చిత్రాలకుతో సంబంధం లేకుండా సరికొత్త కథతో ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అంత్యాక్షరి గ్యాంగ్ కూడా ‘గబ్బర్ సింగ్-2'లో కూడా నటించనుంది. ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

బాబీ మాట్లాడుతూ... ''గబ్బర్‌ సింగ్‌ సీక్వెల్‌ అంటే ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఆశిస్తారో తెలుసు. అవన్నీ మేళవించి ఈ కథను తయారు చేశాం. స్క్రిప్టు పక్కాగా పూర్తయింది. హీరోయిన్, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అని చెబుతున్నారు.

గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే ఈ సీక్వెల్ నిర్ణయం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది. 

English summary
Pawan Kalyan's shocking new avatar has created ripples on the social networking sites. Pawan Kalyan was seen sporting a long thick beard, a white cotton dhoti and lenin kurta. He was almost looking like a new guru in the town in this brand new get-up.
Please Wait while comments are loading...