»   » ప్రభాస్ కోసం తగ్గించుకొన్న శ్రద్ధాకపూర్.. లావెక్కిన అనుష్కకు చెక్

ప్రభాస్ కోసం తగ్గించుకొన్న శ్రద్ధాకపూర్.. లావెక్కిన అనుష్కకు చెక్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాహుబలి తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక అనేక మలుపులు తిరుగుతూ క్లైమాక్స్‌కు చేరుకొన్నట్టు సమాచారం. సాహో చిత్రంలో హీరోయిన్ ఎంపిక కోసం బాలీవుడ్ హీరోయిన్లు కత్రినా కైఫ్, శ్రద్ధాకపూర్, దిశా పటానీ, అనుష్క పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే ఓ దశలో అనుష్క ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల ఆమెను సాహో నుంచి తప్పించినట్టు ఫిలింనగర్‌లో బలంగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం సాహో నిర్మాతలు శ్రద్ధాకపూర్‌ను ఖారారు చేసినట్టు తెలుస్తున్నది.

  బాలీవుడ్ హీరోయిన్ కోసం వేట

  బాలీవుడ్ హీరోయిన్ కోసం వేట

  సాహో చిత్రం దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ జాతీయ స్థాయికి పెరిగిపోవడంతో ఈ చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అందుకే గుర్తింపు, క్రేజ్ ఉన్న బాలీవుడ్ హీరోయిన్ కోసం వెతికారు. ఈ ఎంపిక ప్రక్రియలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ప్రభాస్ కెరీర్‌లోనే గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈ వ్యవహారం జరుగడం గమనార్హం.


  Prabhas' New Look is Out, Check out
  శ్రద్ధాకపూర్ భారీగా డిమాండ్

  శ్రద్ధాకపూర్ భారీగా డిమాండ్

  బాహుబలి2 రిలీజ్‌కు ముందు తొలుత శ్రద్ధాకపూర్‌ను సంప్రదించారు. ఆ సమయంలో ప్రభాస్ గురించి బాలీవుడ్‌లో ఎక్కువగా తెలియకపోవడం వల్ల శ్రద్ధాకపూర్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. సాహోలో నటించేందుకు రూ.7 కోట్ల పారితోషికాన్ని అడిగినట్టు సమాచారం. అయితే ఆమె అడిగిన రేటు నచ్చకపోవడంతో నిర్మాతలు వెనుకడుగు వేశారు.


   అనుష్కను తప్పించారిలా..

  అనుష్కను తప్పించారిలా..

  గత చిత్రాల్లో ప్రభాస్‌తో కెమిస్ట్రీ అదరగొట్టేయడంతో ఓ దశలో అనుష్కను ఖారారు చేశారు. కానీ బాహుబలి2 తర్వాత అనుష్క లావెక్కిపోవడంతో ప్రభాస్ పక్కన సరిపోదనే నిర్ధారణకు వచ్చారు. దాంతో మళ్లీ హీరోయిన్ వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో శ్రద్ధా కపూర్‌ను సంప్రదించారట.


  బాహుబలి తర్వాత శ్రద్ధా ఓకే..

  బాహుబలి తర్వాత శ్రద్ధా ఓకే..

  దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు మోర్మోగుతుండటంతో శ్రద్ధా కపూర్ సాహోలో నటించడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తున్నది. తన రెమ్యునరేషన్ కూడా భారీగా తగ్గించుకొన్నట్టు సమాచారం. త్వరలోనే శ్రద్ధాకపూర్ ఎంపికను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.


  సాహో టీజర్ మంచి రెస్పాన్స్

  సాహో టీజర్ మంచి రెస్పాన్స్

  ఇక బాహుబలి రిలీజ్‌కు ముందు రిలీజ్ చేసిన సాహో టీజర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ బాహుబలి రిలీజ్ అయి సుమారు నాలుగు నెలలు దాటినా సాహో పూర్తిస్థాయిలో పట్టాలెక్కినట్టు కనిపించడం లేదు. ఇప్పటివరకు ప్రభాస్ షూటింగ్‌లో పాల్గొన్నట్టు దాఖలాలు లేవు. కానీ బాలీవుడ్ నుంచి నీల్ నితిన్ ముఖేష్, చంకీ పాండే లాంటి నటులు బోర్డుపైకి వచ్చారు.


  ముంబైలో ప్రత్యేకంగా సెట్

  ముంబైలో ప్రత్యేకంగా సెట్

  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సాహో చిత్రం రిలీజ్ కానున్నది. ఈ చిత్రం కోసం ముంబైలో ప్రత్యేకంగా సెట్ వేసినట్టు వార్తలు వచ్చాయి. యూరప్, దుబాయ్, అబుదాబీ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ముంబైలో జరిగే షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొంటారనే వార్త జోరుగా ప్రచారం జరుగుతున్నది.  English summary
  Shraddha Kapoor has been finalised for Prabhas’ Saaho. Anushka Shetty was originally supposed to be part of the film but her weight became a major deterrent in her selection for the film. As per reports, Prabhas will not dub for the Hindi version. The actor has become the most in-demand actor now because of Baahubali series’ stupendous success and guess that could have prompted Shraddha to say yes to the project as well.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more