»   » ప్రభాస్ డిన్నర్‌కి శ్రద్దా ఫిదా.. విందులో వంటకాల జాబితా ఇదే

ప్రభాస్ డిన్నర్‌కి శ్రద్దా ఫిదా.. విందులో వంటకాల జాబితా ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Shraddha Impressed For The Prabhas Special Treat ప్రభాస్ డిన్నర్‌కి శ్రద్దా ఫిదా..

  బాహుబలి తర్వాత ప్రబాస్ నటిస్తున్న సాహో చిత్రం షూటింగ్ ఇప్పుడిప్పుడే జోరందుకోంటుంది. అనేక ట్విస్టుల తర్వాత హీరోయిన్ గా తెరపైకి వచ్చిన శ్రద్ధాకపూర్, ప్రభాస్ మధ్య రిలేషన్ జోరుగానే కొనసాగుతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల షూటింగ్ కు హాజరైన శ్రద్ధాకు ప్రభాస్ రాయల్ ట్రీట్ ఇవ్వడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభాస్.. శ్రద్దాకు కొసరి కొసరి తినిపించడాన్ని చూసిన యూనిట్ సభ్యులు గుసగుసలాడుకోవడం కనిపించిందట.

  శ్రద్దాకు రాయల్ ట్రీట్...

  శ్రద్దాకు రాయల్ ట్రీట్...

  సాహో షూటింగ్ అనంతరం ఇటీవల చిత్ర యూనిట్ ఆటవిడుపుగా హైదరాబాద్ వంటకాలను రుచి చూడాలని ప్లాన్ చేశారట. ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనేందుకు అతిథిగా హైదరాబాద్ కు వచ్చిన శ్రద్ధా బ్రహ్మాండమైన విందును ప్రభాస్ ఏర్పాటు చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ప్రభాస్ ప్రత్యేకంగా హైదరాబాద్ వంటలను చేయించారని వినికిడి.

  20 రకాల వంటకాలతో...

  20 రకాల వంటకాలతో...

  అర్బాటంగా ఏర్పాటు చేసిన ఈ విందులో దాదాపు 20 రకాల నోరు ఊరించే వంటకాలను సిద్ధం చేశారట. వాటిని చూసి శ్రద్ధ మనసు ఆపుకోలేక పుష్టిగా విందారగించిందట. ప్రభాస్ ఇచ్చిన అతిథ్యానికి శ్రద్ధా ఫిదా అయిపోయిందట. హైదరాబాద్ వంటకాలను చాలా ఇష్టంగా తిన్నట్లు శ్రద్ధ తన సన్నిహితులతో చెప్పిందని సమాచారం.

  సోషల్ మీడియాలో వైరల్...

  సోషల్ మీడియాలో వైరల్...

  ప్రభాస్ ఏర్పాటు చేసిన విందులో వంటకాలకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో చాలా రకాల వంటకాలు కనిపించడం గమనార్హం. స్వతాహాగానే
  ప్రభాస్ భోజన ప్రియుడు. ఈ విందులో వడ్డించిన ఆహార పదార్థాలు ప్రభాస్ టేస్ట్ కి అద్దం పట్టిందని చెప్పుకుంటున్నారు.

  తొలిసారి టాలీవుడ్ కు...

  తొలిసారి టాలీవుడ్ కు...

  బాలీవుడ్ లో అనేక హిట్ చిత్రాల్లో నటించిన శ్రద్ధా కపూర్ ప్రస్తుతం తొలిసారి టాలీవుడ్ లో రంగప్రవేశం చేసింది. బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రభాస్ సరసన నటించే అవకాశాన్ని
  దక్కించుకుంది. అంతేకాకుండా బ్యాడ్మింటన్ క్రిడాకారిణి సైనా నేహ్వాల్ బయోపిక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  English summary
  Shaddha Kapoor and her Saaho co-star Prabhas have already begun bonding well. At first, the duo made a pact that they'll help each other out in learning the new languages and now, being the true gentleman that he is, Prabhas treated Shraddha to a sumptuous Hyderabadi meal. source close to the team told, The entire team took off some time from the shoot and relished on mouth watering Hyderabadi delicacies. There were nearly 17-18 food items served and Shraddha couldn’t stop herself but enjoyed the most amazing food.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more