»   » సైనా నెహ్వాల్‌కు శ్రద్దాకపూర్ దూరం.. ఆ బంధం తెగిందట..

సైనా నెహ్వాల్‌కు శ్రద్దాకపూర్ దూరం.. ఆ బంధం తెగిందట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో ఓ వైపు వరుస విజయాలతో దూసుకెళ్తున్న శ్రద్ధాకపూర్ తాజాగా టాలీవుడ్‌లో కూడా హల్‌చల్ చేస్తున్నది. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓ పక్క సాహోలో నటిస్తూనే బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్‌పైనా దృష్టిపెట్టింది. అయితే సైనా నెహ్వాల్ బయోపిక్ గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేమింటంటే..

 బయోపిక్‌లపై శ్రద్దాకపూర్ దృష్టి

బయోపిక్‌లపై శ్రద్దాకపూర్ దృష్టి

ప్రేమకథా చిత్రాల్లో నటిస్తూనే భారమైన పాత్రలను కూడా శ్రద్ధాకపూర్ పోషిస్తున్నది. ఇటీవల దావూద్ సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన హాసీనా చిత్రంలో నటించింది. అయితే ఆ చిత్రం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పిన శ్రద్ధా కపూర్! There Is No Fact In That News |
 సైనా నెహ్వాల్ బయోపిక్‌లో

సైనా నెహ్వాల్ బయోపిక్‌లో

ఆ తర్వాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించడానికి శ్రద్దాకపూర్ పచ్చజెండా ఊపింది. అమోల్ గుప్తా దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం ప్రిపరేషన్స్ కూడా ప్రారంభించింది.

 శ్రద్ధాకపూర్ బాడ్మింటన్ శిక్షణ

శ్రద్ధాకపూర్ బాడ్మింటన్ శిక్షణ

పాత్ర కోసం బాడ్మింటన్ శిక్షణకు కూడా హాజరైంది. పుల్లెల గోపిచంద్ వద్ద కొన్నాళ్లు ట్రైనింగ్ కూడా పూర్తి చేసింది. అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపొయిందనే వార్తలు మీడియాలో సంచలనం రేపాయి.

సైనా బయోపిక్ ఆగిపోయిందా?

సైనా బయోపిక్ ఆగిపోయిందా?

సైనా నెహ్వాల్ బయోపిక్ ఆగిపోయిందనే వార్త సినీ వర్గాలకు షాక్ గురిచేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ మూలకు పడిపోయిందట. కొందరైతే నిరంతరంగా వాయిదా పడింది అనే మాట కూడా వినిపించడం గమనార్హం. అయితే అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ బయటకు రాకపోవడం కొన్ని అనుమానాలకు తావిస్తున్నది.

English summary
Shraddha Kapoor's entry into the biopic genre with Haseena Parkar may not have gone as planned, with the film being panned by critics as well as failing to weave magic at the box office. And if a report in DNA is to be believed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X