Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఇంట్రెస్టింగ్: జెర్సీ భామ కోసం మెగాస్టార్ చిరంజీవి వెయిటింగ్
Recommended Video
సినీ ఇండస్ట్రీ లాంటి గ్లామర్ ప్రపంచంలో ఎవరి దశ ఎలా తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం. కొందరు నటీనటులు ఎంత కష్టపడినా అందుకోలేని ఫీట్.. మరికొందరికి ఉహించక పోయినా ఇంటిముందరకు వస్తుంది. కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ అలాంటి ఓ అరుదైన అవకాశాన్ని పొందిందని తెలుస్తోంది. ఓ హీరోయిన్ ఇలాంటి అవకాశం కొట్టేయడం కామనే అయినా కెరీర్ ఆరంభం లోనే ఇలా అనుకోని అవకాశం తట్టడం మాత్రం శ్రద్ధా శ్రీనాథ్ అదృష్టం గానే చెప్పుకోవాలి. ఆ వివరాలు చూస్తే..

శ్రద్దా శ్రీనాథ్ యూ టర్న్
కన్నడ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ తన మాతృ భాష కన్నడలోనే తెరంగేట్రం చేసింది. యూ టర్న్ సినిమా ద్వారా వెండితెర గడప తొక్కిన ఈ భామ ఆ తర్వాత తెలుగు తెరపైకి యూ టర్న్ తీసుకుంది. టాలీవుడ్‌లో మొదటి సినిమాగా జెర్సీ ఎంచుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన మొదటి రెండు సినిమాలు సక్సెస్ కావడంతో కన్నడ, తెలుగు చిత్రసీమల్లోని దర్శక నిర్మాతల దృష్టి శ్రద్దా శ్రీనాథ్ పై పడింది.

నాచురల్ స్టార్‌తో రొమాన్స్
కన్నడ యూ టర్న్ తర్వాత వెంటనే జెర్సీ సినిమాలో నటించిన శ్రద్దా శ్రీనాథ్ నాచురల్ స్టార్ నానితో యమ రొమాన్స్ చేసేసింది. నానికి లవర్ గా, భార్యగా, బాధ్యతలు భుజాన వేసుకున్న ఇల్లాలుగా పలు కోణాల్లో తన నటనతో మెప్పించింది శ్రద్దా. ఈ రకంగా జెర్సీ చిత్ర విజయంలో తనదే మేజర్ రోల్ అని నిరూపించుకుంది. గ్లామర్ తో పాటు అందుకు తగ్గ అభినయం శ్రద్దా శ్రీనాథ్ సొంతమవడం ఆమెకు బాగా ప్లస్ అవుతోంది.

ఏకంగా చిరంజీవి వెయిటింగ్ చేస్తున్నాడంటే
జెర్సీ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ క్యారెక్టరైజేషన్ పట్ల టాలీవుడ్‌లోని అగ్రహీరోలు, దర్శకులు బాగా ఇంప్రెస్స్ అయ్యారట. తెలుగులో శ్రద్ధా చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. ఆ అంశాన్ని పట్టించుకోకుండా ఆమెతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ అగ్ర హీరోలు సై అనేస్తున్నారట. ఈ నేపథ్యం లోనే చిరంజీవి కూడా లైన్‌లో ఉన్నాడనేది తాజా సమాచారం.

కొరటాల శివ కన్ను పడింది
ఇటీవలే భరత్ అనే నేను సినిమాతో సెన్సేషనల్ హిట్ సాధించి మంచి ఊపుమీదున్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఈయన తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం చిరు నటిస్తున్న సైరా షూటింగ్ పూర్తికాగానే కొరటాల, చిరు ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో చిరు సరసన హీరోయిన్‌గా శ్రద్దా శ్రీనాథ్ పేరును ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట కొరటాల.
మూడు రోజులు పట్టింది.. ప్రెపేర్డ్‌గా వెళ్లినా సరే వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్తాడు: రకుల్

బడా హీరోయిన్లతో.. భలే అదృష్టం
అతి త్వరలో సెట్స్ పైకి రానున్న కొరటాల, చిరు ప్రాజెక్టులో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉంది. అయితే ఇందులో మొదటి హీరోయిన్‌గా అనుష్క లేదా నయనతార పేర్లు పరిశీలనలో ఉన్నాయట. రెండో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్ పేరు వినిపిస్తోంది. ఇదే నిజమైతే బడా హీరోయిన్ల నడుమ మెగాస్టార్ చిరంజీవితో చిందులేసే అరుదైన అదృష్టం శ్రద్దా శ్రీనాథ్ సొంతమైనట్లే మరి.