»   »  రోబోలో శ్రియ ?

రోబోలో శ్రియ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shriya
ఇప్పుడు ఎక్కడ చూసినా రజనీకాంత్ 'రోబో' కబుర్లు. . చర్చలు. అందులోనూ ఈ సినిమా రోజుకో వెరైటీ ట్విస్టుతో మలుపు తిరుగుతోంది. తాజాగా 'రోబో' లో రజనీకి హీరోయిన్ గా అనుకుంటున్న ఐష్ ప్లేసులోకి శ్రియ వచ్చిందంటున్నారు. ఆమె ఇంతకు ముందు రజనీతో 'శివాజీ' లో 'వాజీ వాజీ శివాజీ' అంటూ రెచ్చిపోయింది. తన అంద చందాలతో అరవ కుర్రాళ్ళ గుండెలకు గేలం వేసింది. దాంతో మళ్ళీ ఈ మేజిక్ ని రిపీట్ చేస్తే బావుంటుందనే శంకర్ ఆలోచనలో పడ్డారట. శ్రియ కూడా సముఖంగానే ఉందిట. ఆమెకు శివాజీ తరువాత ఆ రేంజి భారీ సినిమా పడలేదు. అంతే కాకుండా జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్ తో చేస్తున్న 'మల్లన్న' ఎప్పుడు పూర్తయి రిలీజవుతుందో తెలియని వేగంతో ముందుకు వెళ్తోందట. అలాగే చెప్పుకోవటానికి రెండు హాలీవుడ్ ఫిల్మ్ లు చేతిలో ఉన్నాయిగాని అవి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని స్థితి. దాంతో రెండేళ్ళు వరస డేట్స్ రోబో కు అడిగినా కాదనలేని పరిస్థితి లో ఉందిట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X