»   »  నాగ్ తో నాలుగోసారి..సెంటిమెంటా?

నాగ్ తో నాలుగోసారి..సెంటిమెంటా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, కార్తీ హీరోలుగా మెదటిసారి కలిసి నటిస్తున్న మల్టిస్టారర్ మూవి ఊపిరి. తెలుగు, తమిళంలో ఒకేసారి నిర్మితమవుతున్న ఈ సినిమాలోకి మరోక హీరోయిన్ చేరుతోందని సమాచారం. నాగార్జునతో సంతోషం, నేనున్నాను , మనం నాలుగు సూపర్ హిటే సినిమాలు చేసిన శ్రేయా సరన్ ఈ సినిమాలో ఓ మఖ్య పాత్రలో కనిపించనుందని సమచారం.

ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ లో ఉన్న ఈ సినిమాని ఫిబ్రవరి 5, 2016 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిని పి.వి.పి. సినిమా వారు నిర్మిస్తుంన్నారు. వంశీ పైడపల్లి డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు, కెమెరామెన్ పి.ఎస్. వినోద్.

హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్' కి రీమేక్ గా ఊపిరి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క - అడవి శేష్ జంటగా కనిపించనున్నారు.

నాగార్జున మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ వినలేదు. వంశీ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యా. మల్టీస్టారర్‌చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది అన్నారు.

Shriya Saran in Nagarjuna's Oopiri

''నా సినిమాలన్నీ తెలుగులో అనువాద రూపంలో విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. నాగార్జునగారితో తెర పంచుకోవడం ఆనందంగా ఉంద''ని కార్తి తెలిపారు. ''నాగార్జున, కార్తి ఈ సినిమా చేస్తామని ముందుకు రావడంతో సగం విజయం సాధించినంత ఆనందంగా ఉంది. నేను రాసుకొన్న పాత్రలకు వాళ్లయితేనే పూర్తిగా న్యాయం చేస్తారనిపించింద''న్నారు వంశీ పైడిపల్లి.

ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్‌, ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: శ్రీకర ప్రసాద్‌.

English summary
Makers of Nagarjuna and Karthi's bilingual multistarer project, Oopiri have roped in Shriya Saran in to their film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu