»   »  నాగ్ రికమెండేషన్ తోనే శ్రియ సీన్ లోకి...

నాగ్ రికమెండేషన్ తోనే శ్రియ సీన్ లోకి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, శ్రియ కాంబినేషన్ లో వచ్చిన సంతోషం, నేనున్నాను, బాస్, మనం చిత్రాలు విజయవంతమయ్యాయి. అందుకేనేమో ...శ్రియను సెంటిమెంట్ తో తన తాజా చిత్రం ‘ఊపిరి'లో ఓ కీ రోల్ కు తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ విషయమై నాగార్జున రికమెండ్ చేసి మరీ సీన్ లోకి తెచ్చాడని గుసగుసలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. రీసెంట్ గా నాగార్జున, శ్రియ మధ్యన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని, అవి సినిమా సెకండాఫ్ లో వస్తాయని చెప్తున్నారు.

చిత్రం పూర్తి వివరాల్లోకి వెళితే... అక్కినేని నాగార్జున, తమిళ నటుడు కార్తీల కలయికలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఊపిరి' చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను ఇంతకు ముందు ఫిబ్రవరి 5న విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్రం రిలీజ్ డేట్ మార్చి 25కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

 Shriya special in Nag's Oopiri?

హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్' కి రీమేక్ గా ఊపిరి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క - అడవి శేష్ జంటగా కనిపించనున్నారు. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ కావడంతో ‘ఊపిరి' చిత్రంపై అంచనాలు ఎక్కువయ్యాయి.

ఈ సినిమా గురించి నాగార్జున ఆ మధ్య మాట్లాడుతూ... ''ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ వినలేదు. వంశీ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యా. మల్టీస్టారర్‌చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంద''న్నారు.
''నా సినిమాలన్నీ తెలుగులో అనువాద రూపంలో విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. నాగార్జునగారితో తెర పంచుకోవడం ఆనందంగా ఉంద''ని కార్తి తెలిపారు.

''నాగార్జున, కార్తి ఈ సినిమా చేస్తామని ముందుకు రావడంతో సగం విజయం సాధించినంత ఆనందంగా ఉంది. నేను రాసుకొన్న పాత్రలకు వాళ్లయితేనే పూర్తిగా న్యాయం చేస్తారనిపించింది''న్నారు వంశీ పైడిపల్లి.

ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్‌, ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: శ్రీకర ప్రసాద్‌.

English summary
Shriya in an important role in Nagarjuna, Karthi's multi starrer ‘Oopiri’ directed by Vamsi Paidipally. Prasad V Potluri said the film will be releasing on March, 25th in a grand manner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu