»   » షాక్ :శ్రుతిహాసన్...నాగ్ ప్రాజెక్టు నుంచి బయిటకు??

షాక్ :శ్రుతిహాసన్...నాగ్ ప్రాజెక్టు నుంచి బయిటకు??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున, కార్తీ కాంబినేషన్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శృతిహాసన్ నటిస్తోంది. అయితే ఇప్పుడామె ఆ ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. డేట్స్ ఎడ్జెక్టు చేయలేక ఆమె ప్రాజెక్టు నుంచి వైదొలిగిందంటూ తమిళ మీడియా అంటోంది. అయితే గతంలోనూ మహేష్ చిత్రం నుంచి ఆమె బయిటకు వచ్చేసిందంటూ వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని తెలిసింది. ఈ విషయమై కూడా శృతి ..వివరణ ఇస్తేకానీ చెప్పే పరిస్ధితి లేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శృతి హాసన్ మాట్లాడుతూ...''ఎవరు ఎన్ననుకొన్నా, ఏం చేసినా విజయం కోసమే. విజయానికి మించిన కిక్‌ ఏదీ ఇవ్వదు. హిట్‌ అనే పదం ఎందరి తలరాతలో మార్చేస్తుంది. అలాంటి విజయం ఎప్పుడు దొరికినా అపురూపమే..'' అంటోంది శ్రుతి హాసన్‌. 'గబ్బర్‌సింగ్‌' తరవాత శ్రుతి కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలతో టాప్‌గేర్‌లోకి వచ్చేసింది.

Shruti Haasan leaves Nagarjuna-Karthi project

''హిట్‌ అనేది జాతకాల్ని పూర్తిగా మార్చేస్తుంది. స్టార్లు పుట్టుకొచ్చేస్తారు. ప్రతిభకు విజయం తోడైతే ఇక చెప్పనవసరం లేదు. అలాగని విజయం సాధించిన వాళ్లంతా ప్రతిభావంతులు కాకపోవచ్చు. వాళ్లను విజయలక్ష్మి ఎంత కాలం అంటిపెట్టుకొని ఉంటుందో చెప్పలేం. కానీ ప్రతిభ ఉంటే.. ఎప్పటికైనా విజయం సాధించొచ్చు. కాస్త ఆలస్యమైనా.. ఆ విజయం శాశ్వతం. నా కెరీర్‌లో విజయాలు లేవని ఎప్పుడూ బాధపడలేదు. నేను నమ్ముకొంది ప్రతిభనే. అదే విజయానికి దారి చూపిస్తుందన్న నమ్మకం నాకెప్పుడూ ఉంటుంది'' అంది.

ప్రస్తుతం శృతి హాసన్... మహేష్ బాబు తాజా చిత్రం శ్రీమంతుడులో చేస్తోంది. అలాగే విజయ్ సరసన ఆమె పులి చిత్రం చేస్తోంది. అంతేకాకుండా అక్షయ్ కుమార్ హీరోగా చేస్తున్న గబ్బర్ చిత్రం(ఠాగూర్ రీమేక్)లోనూ ఆమె హీరోయిన్ గా చేసి ,ప్రస్తుతం ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఇలా వరసగా బిజిగ ఉన్న ఆమె కార్తి,నాగార్జున ప్రాజెక్టులో కొనసాగుతుందో లేదో చూడాలి.

English summary
Shruti Haasan who is expected to share screen with both Nagarjuna Akkineni and Tamil hero Karthi together in Vamsi Paidipalli’s untitled project has opted to come out of the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu