»   » శృతిహాసన్ పెళ్లి జరిగిందా?.. వైరల్‌గా మారిన వార్త.. కమల్, సారికలతో..

శృతిహాసన్ పెళ్లి జరిగిందా?.. వైరల్‌గా మారిన వార్త.. కమల్, సారికలతో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు, బహెన్ హోగి తెరీ చిత్రాల తర్వాత సినీ నటి శృతిహాసన్ సినిమా ఆఫర్లను తిరస్కరిస్తుందనే వార్త సినీ వర్గాల్లో అనేక చర్చలకు దారి తీసింది. ఎందుకంటే అప్పటికే హిందీ, తెలుగు, తమిళ రంగాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. అన్నిరంగాల సూపర్‌స్టార్లతో జతకట్టింది. వరుస విజయాలను అందుకొంటున్న సమయంలో భారీ బడ్జెట్ సినిమాలను వదులకోవడంతో శృతిహాసన్ పెళ్లికి బాజాలు మోగుతున్నాయనే విషయం వైరల్‌గా మారింది. కానీ తాజాగా పెళ్లిలో బాయ్‌ఫ్రెండ్‌తో చేసిన హంగామా చూసి పెళ్లి జరిగిందనే మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ప్రియుడితో పబ్లిక్ గా తిరుగుతున్న శ్రుతి హాసన్
 సంఘమిత్ర రిజెక్ట్

సంఘమిత్ర రిజెక్ట్

తమిళంలో ప్రతిష్టాత్మకంగా రూపొందే సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలగడం అప్పట్లో వివాదంగా మారింది. సీనియర్ నటి కుష్భూ, శృతి మధ్య ట్విట్టర్‌లో యుద్ధం జరిగింది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదు. మరో రెండేళ్లు ఆ సినిమా గురించి వెయిట్ చేయలేను అని శృతి వ్యాఖ్యలు చేయడం వెనుక ప్రియుడు మైఖేల్‌ కోర్సలేతో అఫైర్ అనే కారణం వెలుగు చూసింది.

మైఖేల్ కోర్సలేతో శృతి

మైఖేల్ కోర్సలేతో శృతి

గత కొద్దికాలంగా బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్న శృతిహాసన్ విషయం మీడియాలో ప్రముఖంగా కనిపించింది. ముంబై ఎయిర్‌పోర్టుకు వెళ్లి మైఖేల్‌ను రిసీవ్ చేసుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. అంతేకాకుండా కాటమరాయుడు షూటింగ్ సందర్భంగా ముస్పోరిలో వారిద్దరూ వెకేషన్‌కు వెళ్లడం మరింత హల్‌చల్ చేసింది. ఇంతకీ ఎవరీ మైఖేల్ అంటే..

 మైఖేల్ లండన్‌లో

మైఖేల్ లండన్‌లో

మైఖేల్ లంన్‌లో బ్రిటీష్ అల్టర్నేటివ్ రాక్ బ్యాండ్ డైనోసార్ పైల్ అప్‌ను నిర్వహిస్తుంటాడు. డ్రామా సెంటర్ లండన్, బ్రియన్ తిమోనీ యాక్టర్స్ స్టూడియోలో శిక్షణ పొందిన నటుడు కూడా. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా శృతికి మైఖేల్ పరిచయం జరిగింది. అలా జరిగిన పరిచయం అఫైర్‌కు దారి తీసింది. అప్పటి నుంచి శృతి లండన్‌కు వెళ్లడం, మైఖేల్ ఇండియాకు రావడం జరుగుతున్నది.

 శృతిహాసన్, మైఖేల్ హ్యాపీగా

శృతిహాసన్, మైఖేల్ హ్యాపీగా

శృతి, మైఖేల్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. శృతికి మైఖేల్ అంటే ఎంత ఇష్టమో.. మైఖేల్‌కు కూడా శృతి అంతే ఇష్టం అని సన్నిహితులు పేర్కొంటున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని హింట్ ఇచ్చారు.

 కొత్త దంపతుల మాదిరిగా

కొత్త దంపతుల మాదిరిగా

ఇలాంటి వార్తల మధ్య ఇటీవల యాక్టర్ అధవ్ కన్నదాసన్, వినోధిని పెళ్లిలో మైఖేల్, శృతిహాసన్ కొత్త దంపతుల మాదిరిగా సంప్రదాయ దుస్తుల్లో దర్శనమివ్వడం అనేక అనుమానాలకు దారి తీసింది. ఓ దశలో వారి పెళ్లి జరిగిందంటూ మీడియాలో పుకార్లు జోరుగా షికారు చేశాయి.

కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్

కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్

మైఖేల్, శృతి ప్రేమను తొలుత కమల్ తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ పెళ్లిలో ఈ జంటతో కమల్ హాసన్ కూడా ఉండటంతో వారి ప్రేమకు, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వాదన మొదలైంది.

 శృతి అఫైర్‌కు సారిక కూడా

శృతి అఫైర్‌కు సారిక కూడా

శృతి ప్రేమకు తల్లి సారిక కూడా ఆమోదం తెలిపిందనే తాజా సమాచారం. తల్లి సారికతో కలిసి శృతి ఇటీవల కనిపించింది. దాదాపు శృతిహాసన్, మైఖేల్ పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేవనే సమాధానం వినిపిస్తున్నది. పెళ్లి అయిందనే వార్త బహుదూరం అయినప్పటికీ.. త్వరలోనే పెళ్లి జరుగనుందనే వార్త కోలీవుడ్‌లో కోడై కూస్తున్నది.

English summary
Shruti Haasan, Michael Corsale wedding on the cards! Only last week, the two were spotted hanging out with Sarika, Shruti ‘s mother. It all seems like, Shruti is now taking her relationship with Michael to the next level. While actor Aadhav Kannadasan and Vinodhini made for a beautiful couple at their wedding, the other highlight was Shruti Haasan‘s appearance with her boyfriend Michael Corsale. Shruti and Michael hanging out with Kamal Haasan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu