»   » ఖైదీతో శృతిహాసన్.. శాతకర్ణితో తమన్నా.. క్యా జోడీ హై

ఖైదీతో శృతిహాసన్.. శాతకర్ణితో తమన్నా.. క్యా జోడీ హై

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ అరుదైన కాంబినేషన్‌కు తెర తీయనున్నదా? అగ్ర హీరోల బాలకృష్ణ, చిరంజీవి పక్కన యువ హీరోయిన్లు శృతిహాసన్, తమన్నా నటించనున్నారా? అనే ప్రశ్నలకు ఫిలింనగర్‌లో అవుననే సమాధానం వినిపిస్తున్నది. అయితే అధికారికంగా ధ్రువీకరణ జరిగితే తప్ప.. ఇలాంటి రూమర్లకు తెరపడే అవకాశం ఉంది.

 శాతకర్ణితో శ్రీయ.. ఖైదీతో కాజల్ జోడి

శాతకర్ణితో శ్రీయ.. ఖైదీతో కాజల్ జోడి

బాలకృష్ణ తన 100 చిత్రం శాతకర్ణిలో సీనియర్ నటి శ్రీయ నటించి మెప్పించింది. చిరంజీవి 150 చిత్రంలో కాజల్ అదరగొట్టింది. ఇక చిరంజీవి 151 చిత్రంలో శృతిహాసన్, బాలకృష్ణ 101 చిత్రంలో తమన్న నటించనున్నారనే వార్త బలంగా వినిపిస్తున్నది.

 కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ


బాలకృష్ణ 101వ చిత్రం కేఎస్ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతోందని ప్రచారం జోరుగా జరుగుతున్నది. ఇటీవల బాలయ్యకు రవికుమార్ కథ వినిపించారని, కథ విన్న ఆయన సినిమా చేయడానికి తన అంగీకారం తెలిపారని తెలిసింది.
అందులో కథానాయికగా తమన్నా ఖరారైందని కూడా ప్రచారం సాగుతోంది.

 సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో చిరంజీవి

సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో చిరంజీవి


చిరంజీవి తన తన 151వ చిత్రాన్ని సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చేస్తారు. ఇప్పటికే కథ కూడా సిద్ధమైంది. ఆ చిత్రంలో చిరు సరసన శ్రుతిహాసన్ నటించే అవకాశాలున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాజల్‌లాగే శ్రుతి కూడా మెగా హీరోలు పవన్‌ కల్యాణ్‌, రాంచరణ్‌, అల్లు అర్జున్‌తో ఆడిపాడింది. చిరుతో శృతి నటిస్తే కాజల్‌ సరసన ఆమె కూడా చేరినట్లవుతుంది.

 బాహుబలితో తమన్నా.. కాటమరాయుడితో శృతి

బాహుబలితో తమన్నా.. కాటమరాయుడితో శృతి


ప్రస్తుతం తమన్నా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌'తో ప్రేక్షకుల ముందుకు రానున్నది. శ్రుతిహాసన్‌ ‘కాటమరాయుడు'తో షూటింగ్‌లో బిజీగా ఉన్నది. ఈ రెండు చిత్రాలు వేసవిలో సందడి చేయనున్నాయి. అయితే బాలకృష్ణ, చిరంజీవిల సరసన నటించే విషయం పై అటు శృతి, తమన్నాలు గానీ, అటు ఆయా నిర్మాతలు గానీ పెదవి విప్పడం లేదు.

English summary
Chiranjeevi is getting ready with 151th movie. Sametime Balakrishna making efforts to do his 101 movie. There is a rumour that in this movies Shruti Haasan, Tamanna to pair with Chiranjeevi, Balakrishna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu