»   » ఏంటీ..శృతి హాసన్ ఒప్పుకుందా

ఏంటీ..శృతి హాసన్ ఒప్పుకుందా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శృతి హాసన్ ఇప్పుడు తెలుగు,తమిళ భాషల్లో టాప్ హీరోయిన్. అలాంటి ఆమెను చిన్న సినిమాలో ఐటం సాంగ్ కు ఒప్పించటమంటే మామూలు విషయం కాదు. ఆ అసాధ్యాన్ని ...కోన వెంకట్ సుసాధ్యం చేసాడంటున్నారు. టాప్ రైటర్ గా ఎదిగిన కోన వెంకట్ కు కమర్షియల్ ఎలిమెంట్స్ ని సినిమాలో ఎలా కూర్చాలో పూర్తిగా తెలుసు. అందుకోసం ఆయన అనుసరించే మార్గాలు కూడా ఆకర్షినీయంగా ఉంటాయి. తాజాగా ఆయన సమర్పిస్తున్న గీతాంజలి చిత్రంలో..శృతి హాసన్ ని ఐటం సాంగ్ కు ఒప్పించారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె శ్రీను వైట్ల చిత్రం ఆగడులో ఐటం సాంగ్ చేస్తోంది. మొదట ఆమె ఒప్పుకోకపోయినా...ఎక్కువ ఎమౌంట్ ఆఫర్ చేసి ఒప్పించారని తెలుస్తోంది.


అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గీతాంజలి'. శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ నేపథ్య గళాన్ని అందిస్తున్నారు. రాజ్‌కిరణ్‌ దర్శకుడు. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ సమర్పిస్తున్నారు.చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల రెండో వారంలో పాటల్ని విడుదల చేస్తారు. సోమవారం చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.

Shruti Hasan in another special song?

కోన వెంకట్‌ మాట్లాడుతూ ''కథపై నమ్మకంతో నేనే ఈ చిత్రాన్ని నిర్మించాలనుకొన్నా. ఆ సమయంలోనే ఎం.వి.వి.సత్యనారాయణ పరిచయమయ్యారు. దీంతో మేమిద్దరం కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. గీతాంజలి అనే యువతి జీవితం చుట్టూ సాగే కథ ఇది. ఆ అమ్మాయి ఎవరన్నదే ఆసక్తికరం. ఉత్కంఠ, వినోదం మేళవింపుతో రూపొందుతున్న చిత్రమిది. బ్రహ్మానందం పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఆయనపై ప్రత్యేకంగా ఓ పాట ఉంది. దాన్ని త్వరలోనే విడుదల చేస్తాం. శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేష్‌, షకలక శంకర్‌ పాత్రలు కథను మలుపు తిప్పుతాయి. వచ్చే నెల మొదటి వారంలో సినిమాను విడుదల చేస్తామ''అన్నారు.

''అందరూ సొంత సినిమాలా భావించి పని చేశారు. అంజలి పాత్రతో పాటు సాయి శ్రీరామ్‌ కెమెరా పనితనం, ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం చిత్రానికి బలాన్నిస్తాయి'' అన్నారు నిర్మాత. రావు రమేష్‌, అలీ, రఘుబాబు, ఝాన్సీ, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Shruti Hasan gave green signal for another special song this time in Anjali's female oriented film Geetanjali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu