»   » ఫ్లాష్ బ్యాక్ లో ముసలమ్మలా కనిపిస్తుందిట

ఫ్లాష్ బ్యాక్ లో ముసలమ్మలా కనిపిస్తుందిట

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : వయస్సులో ఉన్న హీరో,హీరోయిన్స్ డీ గ్లామర్ పాత్రలు పోషించటానికి ఇష్టపడరు. అయితే శృతిహాసన్ తాను మినహాయింపు అంటోంది. తన తండ్రి తరహాలోనే వివిధరకాల పాత్రలు వయస్సుతో సంభంధం లేకుండా చేయటానికి ఉత్సాహం చూపిస్తోంది. తాజాగా ఆమె తిగ్మంషు దులియా దర్శకత్వంలో ఓ బాలీవుడ్ చిత్రం చేయటానికి సైన్ చేసింది. యారా టైటిల్ తో రూపొందే ఆ చిత్రంలో ఆమె ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ముసలమ్మ పాత్రలో జీవించనుందట.

మురగదాస్ తుపాకి చిత్రంలో విలన్ గా చేసిన విద్యుత్ జమాల్, అమిత్ సాద్ హీరోలుగా చేస్తున్న ఈ చిత్రం రెండు తరాలకు చెందిన కథను డీల్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర కోసం సీనియర్ నటిని ఎప్రోచ్ అవుదామని అనుకుంటూంటే తానే చేస్తానని ఆమె ముందుకు రావటంతో ఆ యూనిట్ వారు తమ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ దొరికిందని ఫీలయ్యారట.

ఓ వైపు హిట్‌ చిత్రాలు.. మరోవైపు స్టార్‌ హీరోలతో అవకాశాలు.. ఇలా శృతి ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తోందట. హిందీలో 'లక్‌' ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ... టాలీవుడ్‌లో సూర్యకు జంటగా '7ఆమ్‌ అరివు'తో తెరంగేట్రం చేసింది. ఆదిలో అపజయాల హీరోయిన్‌గా ముద్రపడినా.. తెలుగులో 'గబ్బర్‌సింగ్‌'తో ఆ పేరు తుడిచిపెట్టుకుపోయింది. ఆ జోరు కొనసాగిస్తూ రవితేజతో 'బలుపు', రామ్‌చరణ్‌తో 'ఎవడు', తాజాగా అల్లుఅర్జున్‌తో 'రేసుగుర్రం'... ఇలా వరుస హిట్లను అందుకుంది.

Shruti's hair turning grey

ప్రస్తుతం తమిళంలో విశాల్‌తో 'పూజై' నటిస్తుండగా, సూర్యతో ఓ చిత్రం, అలాగే మణిరత్నం మహేష్‌ - నాగార్జునలతో తెరకెక్కించనున్న సినిమాలోనూ శ్రుతిహాసన్‌ ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి కాకుండా.. హిందీలో అక్షయ్‌కుమార్‌తోనూ, 'గబ్బర్‌'లో జాన్‌ అబ్రహంతోనూ నటిస్తోంది. ఇలా మూడు భాషల్లో హిట్లు అందుకోవటమే కాకుండా.. అందరూ స్టార్‌ హీరోలతో నటించటంపై చాలా ఖుషీలో ఉందట శ్రుతి.

అక్కడా.. ఇక్కడా.. అంటూ విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నా.. ఇష్టమైన కష్టం కూడా ఎంతో హాయి అంటూ సన్నిహితుల వద్ద సంతోషాన్ని వ్యక్తం చేస్తోందట. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో కొన్నైనా విజయాల బాట పడితే.. ఇప్పట్లో శ్రుతిహాసన్‌కు తిరుగుండదని విశ్లేషకులు అంటున్నారు.

English summary
Shruti Hasan is now sporting grey hair for her upcoming Bollywood film to be directed by Tigmanshu Dhulia. The film titled Yaara stars Vidyut Jamwal as younger Irrfan Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu