»   » సిద్దార్ధ తాజా చిత్రం 'బావ' కు బయ్యర్లు కరువా?

సిద్దార్ధ తాజా చిత్రం 'బావ' కు బయ్యర్లు కరువా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ రోజు విడుదల అవుతున్న సిద్దార్ద తాజా చిత్రం బావకు బయ్యర్లు కరువయ్యారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినపడుతోంది. సిద్దార్ధ గత రెండు చిత్రాలు ప్లాప్ అవటం ఈ చిత్రానికి క్రేజ్ రాకపోవటానికి మెయిన్ రీజన్ అయితే, ఆల్రెడీ మార్కెట్లో పెద్ద సినిమాలు ఉండగా మద్యలో ఈ సినిమా అవసరమా అన్నట్లు వారు ఫీలయినట్లు సమాచారం. దాంతో చాలా ఏరియాల్లో నిర్మాత స్వయంగా విడుదల చేస్తున్నారని సమాచారం. ఇక హీరోయిన్ గా చేస్తున్న ప్రణీత కూడా పెద్దగా క్రేజ్ ని తేలేకపోయింది. ఆమె పరిచయ చిత్రం ఏం పిల్లో..ఏం పిల్లడో ప్లాప్ కావటం కూడా ఈ చిత్రంపై నెగిటివ్ ఇంపాక్ట్ పడటానికి కారణమైంది. అయితే ఈ చిత్రంలో పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే లవ్ ఆజ్ కల్ లో కీలకమైన సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో లేపేసారని, దాంతో పవన్ టీమ్ చాలా కోపంగా ఉన్నారనేది కూడా హాట్ గా ఈ చిత్రంపై వినపడుతున్న వార్త. అయితే ఈ చిత్రం ఆడియో మాత్రం మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu