»   » సిద్దార్ధ, శృతి హాసన్ చిత్రానికి విచిత్రమైన టైటిల్

సిద్దార్ధ, శృతి హాసన్ చిత్రానికి విచిత్రమైన టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిద్దార్ధ, శృతి హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి 'ఒన్స్ అపాన్ ఎ టియర్ డ్రాప్' అనే టైటిల్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దర్శకుడు కె.సూర్య ప్రకాష్ ఈ టైటిల్ నూటికి నూరు పాళ్ళు కథ కు యాప్ట్ అవుతుందని భావిస్తున్నారుట. అంతేగాక దాన్ని వర్కింగ్ టైటిల్ గా వ్యవహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు ప్రేక్షకులకు టైటిల్ అర్దం అయ్యేందుకు తెలుగులో ట్యాగ్ లైన్ పెట్టాలని భావిస్తున్నారుట.

ఇక కథ ప్రకారం అంగరాజ్యంలో కన్నీటు బొట్టు ఆకారంలో ఉండే ఓ కాల్పనిక గ్రామంలో ఈ జానపద కథ జరుగుతుంది. క్షుద్రశక్తులతో అంగరాజ్యాన్ని నాశనం చేయాలని రాక్షస మహారాణి అనుకుంటుంది. ఆమె బారిన పడిన తొమ్మిదేళ్ళ పాపను కాపాడటానికి ఒక వీరుడు బయలుదేరతాడు. అతడి ప్రేయసి జిప్పీ వనిత. ఆఖరి పోరాటంలో విజయం ఎవరిని వరించిందన్న దిశలో కథనం నడుస్తుంది. కె.రాఘవేంద్రరావు సమర్పణలో వాల్ట్ డిస్నీ (ఇండియా) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే ఈ చిత్రంలో మోహన్‌ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న ఒక రాక్షస మహారాణి పాత్రలో నటిస్తోంది.

Please Wait while comments are loading...