»   » జెకె భారవి దర్శకత్వంలో రొమాంటిక్ హీరో సిద్దార్ద!?

జెకె భారవి దర్శకత్వంలో రొమాంటిక్ హీరో సిద్దార్ద!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు,మంజునాధ వంటి భక్తి రస చిత్రాలకు రచన చేసిన జె.కె.భారవి త్వరలోడైరక్టర్ గా మారబోతున్నారు. ఆయన దర్శకత్వంలో 'శ్రీ జగద్గురు ఆదిశంకర' చిత్రం రూపొందబోతోంది.ఈ చిత్రానికి హీరోగా అంటే ఆదిశంకరుడుగా నటించటానికి సిద్దార్దని సంప్రదించారని తెలిసింది. ప్రముఖ దర్సకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందే ఈ చిత్రంలో సిద్దార్ధ అయితే ఫెరఫెక్ట్ గా సూట్ అవుతాడని అంటున్నారు. రాఘవేంద్రరావు కుమారుడు డైరక్ట్ చేసిన అనగనగా ఒక ధీరుడు చిత్రంలో సిద్దార్ద చేసి ఉన్నాడు.కాబట్టి సిద్దార్ధ ఓకే అంటాడని భావిస్తున్నారు.

అయితే రాఘవేంద్రరావు దర్శకత్వం అయితే ఓకే గానీ భారవి దర్శకత్వంలో నటిస్తే ఎంతవరకూ తనకు ఉపయోగపడుతుందని సిద్దార్ధ బావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక గ్లోబల్‌ పీస్‌ క్రియేటర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం యువతకు పర్శనాలిటి డవలప్ మెంట్ క్లాస్ లుగా ఉంటుందంటున్నారు. ఈ విషయంపై భారవి మాట్లాడుతూ ''ఆది శంకరుడు జీవించింది 32 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులోనే ఆయన జగద్గురువుగా ఎలా మారారు అనేది చిత్ర కథాంశం. యువతకి ఆయన జీవితం ఆదర్శం కావాలి అనే సందేశంతో రూపొందిస్తున్నాం. ఆరుగురు హీరోయిన్స్ , ముగ్గురు హీరోలు ఈ చిత్రంలో నటిస్తారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు.

English summary
'Annamayya' ,'Sri Ramadasu', 'Pandurangadu' writer JK Bharavi now to become director. He is going to be direct 'Adi Shankaracharya' in the supervision of K Raghavendra Rao. Bharavi is ready with the script, songs, screenplay and schedule plan. All that he has to do is to hit the floors with his cast and crew. Bharavi's desire is to pull Siddhartha for the title role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu