»   »  సిద్ధార్థ ప్రేమకు గ్రీన్ సిగ్నల్

సిద్ధార్థ ప్రేమకు గ్రీన్ సిగ్నల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
నువ్వొస్తానంటే నేనొద్దంటానా అన్నట్టుంది బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ కథ. ఈయనగారు హిందీలో నటించిన రంగ్ దే బసంతి సినిమాలో సహ నటి అయిన సొహా అలీఖాన్ తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాడనే వార్త పాతదే అయినా ఇపుడు గ్రీన్ సిగ్నల్ లభించినట్టు సమాచారం. గ్రీన్ సిగ్నల్ వచ్చింది సొహా అలీఖాన్ తల్లిదండ్రులు నుంచి. గ్రీన్ సిగ్నల్ లభించడంతో తమ బంధాన్ని దృఢం చేసుకునే పనిలో ఈ కొత్త లవ్ జంట పడ్డట్టు తెలుస్తోంది. అక్కడ ఇక్కడ కబుర్లు పెట్టకుండా ఈ జంట ఏకంగా సొహా అలీఖాన్ తల్లిదండ్రులను కలిసి విషయం గురించి చర్చించారట. సొహా తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంవత్సరకాలంగా నడుస్తున్న తమ ప్రేమను పటిష్టం చేసుకునే పనిలో పడ్డారట. ఈ సంవత్సరంలో సిద్ధార్థ విషయంలో చాలానే జరిగాయి. తన భార్య మేఘనకు విడాకులిచ్చాడు. ఫ్రీ అయ్యాడు. ఇక మిగిలింది సొహా-సిద్ధార్థల పెళ్లి బాజాలు మోగడమే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X