»   » మాజీ ప్రేమికులు మళ్ళీ కలిసినట్టేనా: నయన్ శింబూల మధ్య మళ్ళీ ప్రేమ..!??

మాజీ ప్రేమికులు మళ్ళీ కలిసినట్టేనా: నయన్ శింబూల మధ్య మళ్ళీ ప్రేమ..!??

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ హీరో శింబు నయన తార ల ప్రేమ వ్యవహారం చాలా కాలం తర్వాత మరోసారి తెర మీదికి వచ్చింది. వివాదాలతో బజారున పడ్డంత పని చేసి మరీ విడిపోయారిద్దరూ.. ఆ ప్రభావం చాలా కలమే వెంటాడింది. తర్వాత నయన తార ప్రభుదేవా విశయం లోనూ మళ్ళీ వారతల్లొకి వచ్చినా కెరీర్ పరంగా మాత్రం ఆ ప్రభావం పడకుందా చూసుకుంది. కానీ శింబూ నెమ్మదిగా లైం లైట్ లొనుంచి వెళ్ళిపోయాడు. కొంత కాలం గా కనీస హిట్ ఒక్కటి కూడా లేదు.

'వల్లవన్' (తెలుగులో వల్లభ) చిత్రంలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడిన శింబు - నయనతార... ఆ సినిమా విడుదలైన కొన్నాళ్లకే విడిపోయారు. అప్పట్లో వీరిద్దరి ప్రేమ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. ఆ తరువాత కలిసి నటించేందుకు ఇద్దరూ విముఖత చూపారు. కనీసం మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవు. అయితే ఈ మధ్య మళ్ళీ నయన్ తోనే అతని కి కలిసొచ్చింది. ఈ మాజీ ప్రేమికులిద్దరూ నటించిన శింబు - నయనతారలతో 'ఇదు నమ్మ ఆళు' తెరకెక్కించి దర్శకుడు పాండిరాజ్‌ సంచలనం సృష్టించారు.

Simbu and Nayanthara dating again?

గత నెలాఖరున విడుదలైన ఈ చిత్రంలో ఇద్దరికీ పెళ్లి కూడా చేశారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తోంది. కొంతకాలంగా హిట్లు లేక సతమతమవుతున్న శింబుకు 'ఇదు నమ్మ ఆళు' రిలీఫ్‌ ఇచ్చింది. ఇందుకు ప్రధాన కారణం నయనతార జోడీగా నటించడమే అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.

దీంతో వీరిద్దరితో మరో సినిమా తీయాలని తమిళ దర్శక, నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, మీరిద్దరూ తెరపై కలిశారు, నిజ జీవితంలోనూ మళ్లీ కలుస్తారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు... నిజ జీవితంలో కష్టం గానీ, తెరపై మళ్లీ కలిసి నటించే అవకాశం ఉందని చెప్పారట. ఈ మాటతో శింబు - నయనతార మళ్లీ కలిసి నటించబోతున్నారని చర్చించుకుంటున్నారు. మరి, ఈ మాజీ ప్రేమికులు మనసులో ఏముందో.. కనీసం తెర మీదైనా కలిసి కనిపించే ఆలోచన ఇకముందైనా చేస్తే బావుంటుందనుకుంటున్నారట తమిళ అభిమానులు..

English summary
Simbu and Nayantara Love has sparked between them again and the good old days seems like set to return.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu