»   » హన్సిక కోసం ఇల్లు కొన్న హీరో

హన్సిక కోసం ఇల్లు కొన్న హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : హన్సిక కోసం కొత్త ఇంటిని కూడా నిర్మిస్తున్నాడు ఆమె లవర్, యంగ్ హీరో శింబు. శింబు-హన్సిక జంటగా నటిస్తున్న 'వాలు', 'వేటెమన్నన్‌' సెట్స్‌పై ఉన్నాయి. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ చిగురించినట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ పెదవి విప్పలేదు. వారి ప్రేమ నిజమైతే పెళ్లికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తానని శింబు తండ్రి టి.రాజేందర్‌ ఇది వరకే ప్రకటించారు.

హన్సిక, తానూ ప్రేమించుకుంటున్న మాట నిజమేనని, పెళ్లే తరువాయి అంటూ అసలు విషయాన్ని ఇటీవలే బయటపెట్టాడు శింబు. అంతేకాదు...హన్సిక కోసం అద్భుతమైన నివాసాన్ని కూడా నిర్మిస్తున్నాడట. చెన్నై శివారులో ఇది సిద్ధమవుతోందట. పెళ్లి తర్వాత ఈ ఇంట్లోనే ఉండాలని భావిస్తున్నాడట. శింబు వ్యక్తిత్వం నచ్చే హన్సిక మనసిచ్చినట్లు ఆమె సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి.

హీరోయిన్ హన్సిక గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతోంది. అన్నీ కుదిరితే త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తమిళ హీరో శింబుతో అమ్మడు కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. చాటుమాటుగా సాగుతున్న వీరి ప్రేమ వ్యవహారం గురించి తమిళ పత్రికలు కోడైకూస్తున్నాయి. హన్సిక మాత్రం 'మా మధ్య అలాంటి బంధమేదీ లేద'ని చెబుతూ వచ్చింది.

ఇక తమ ప్రేమ సంగతి దాచినా లాభం లేదనుకుందో ఏమో కానీ... తాము ప్రేమించుకొంటున్న మాట నిజమే అని ట్విట్టర్‌లో తేల్చిచెప్పింది. 'నా వ్యక్తిగత జీవితం గురించి పుకార్లు ఎక్కువగా వింటున్నాను. ఇక మా ప్రేమ గురించి ఇప్పుడు స్పష్టం చేస్తున్నాను. అవును... నేను శింబుని ప్రేమిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువగా నా వ్యక్తిగత విషయాలు చెప్పను' అని ట్వీట్‌ చేసింది హన్సిక.

English summary
In Kollywood industry rumors about relationship between Simbu and Hansika are doing rounds. Recently Simbu invited Hansika as special guest for his new house ceremony. These acts make them focal point in media and talk of film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu