»   » మాజీ హీరోయిన్ తో బాలకృష్ణ సరసాలు??

మాజీ హీరోయిన్ తో బాలకృష్ణ సరసాలు??

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna
హైదరాబాద్ : సిమ్రాన్,బాలకృష్ణలది హిట్ పెయిర్. బాలకృష్ణతో 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' వంటి చిత్రాలలో నటించిన సిమ్రాన్‌, ఇప్పుడు మళ్లీ బాలకృష్ణ సినిమాలో నటించడానికి ఓకే చెప్పడం ఆయన అభిమానులను ఆనందపరుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'లెజండ్‌' సినిమాలో ఓ ప్రత్యేక పాత్రకు ఆమెను తీసుకుంటున్నారని సమాచారం. వీరిద్దరి మధ్యా ఓ పాట ఉండవచ్చునని చెప్పుకుంటున్నారు. తాజాగా ఆమె నాని హీరోగా నటించిన 'ఆహా కల్యాణం' సినిమా ద్వారా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఇప్పుడు బాలకృష్ణ సినిమా నుంచి ఆఫర్‌ రావడంతోనే వెంటనే అంగీకరించిందని సమాచారం. అయితే, ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు స్పష్టం చేయాల్సి వుంది.

ఒకప్పుడు తెలుగు,తమిళ భాషల్లో నెంబర్ వన్ స్ధాయికి వెళ్ళిన సిమ్రాన్ పెళ్ళయ్యాక వేషాలు కరువయ్యాయి. పెళ్లి అనంతరం తమిళంలో ఓ చిత్రం, తెలుగులో 'జాన్‌ అప్పారావు-40 ప్లస్‌' అనే సినిమా చేసింది. తమిళంలో చేసిన సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ మంచి ఫలితాన్నే ఇచ్చినా ఆఫర్స్ తెచ్చి పెట్టలేకపోయింది. అయితే ఇప్పుడు మరోసారి తెలుగులోకి వస్తోంది. నాని తాజా చిత్రం ఆహా కళ్యాణంలో ఆమె కీ రోల్ చేస్తోంది. అయితే పాత్ర ఏమిటన్నది మాత్రం తెలియరాలేదు. ఈ చిత్రం పిభ్రవరిలో విడుదల కానుంది.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'లెజండ్' . హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెలలో దుబాయి షెడ్యూల్ ఉంది. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. బాలయ్యతో 'సింహా' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, 'దూకుడు' లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం... ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి.ఈ చిత్రంలో లో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని సమాచారం.

జనవరిలో బాలకృష్ణ, చిత్ర హీరోయిన్స్ తో పాటు ఓ గెస్ట్ హీరోయిన్ పై చిత్రీకరించే పాట ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనుందని తెలుస్తోంది. రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్‌సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు.

English summary
Simran is doing a special role in Balakrishna's upcoming film ‘Legend’ under the direction of Boyapati Srinu. The film stars Radhika Apte and Sonal Chauhan in lead. Simran started its second innings with Nani's ‘Aaha Kalyanam’, a re-make of Bollywood ‘Band Baja Barat’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu