»   » చిన్మయి పెళ్లి... సమంత గోల

చిన్మయి పెళ్లి... సమంత గోల

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : శుభమా అని నేను పెళ్లి చేసుకుంటే... మధ్యలో సమంత కి డబ్బింగ్ చెప్పే చిన్మయికి పెళ్లైందంటూ రాస్తారేంటి అని వాపోతోందిట చిన్మయి. ఆమె వివాహం గురించి మీడియాలో వచ్చే వార్తల్లో సమంత కు ఏం మాయ చేసావో చిత్రంలో డబ్బింగ్ చెప్పిన అంటూ ప్రస్దావిస్తూ ఆమె వివాహ వార్త చెప్తున్నారు. తాను ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడినా అవేమి గుర్తు చేయకపోవటం ఆమెకు బాధగానే ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. మరి ఎలా పాపులర్ అయితే అలాగే ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది..వింతేముంది.

  ప్రముఖ గాయని చిన్మయి, నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 'ఏ దేవి వరము నీవో..' అంటూ 'అమృత' చిత్రం ద్వారా గాయనిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు చిన్మయి. ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకత్వంలో పలు చిత్రాల్లో పాటలు పాడారు. నటుడు రాహుల్‌ 'అందాల రాక్షసి'తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరి వివాహం సోమవారం ఉదయం చెన్నైలో జరిగింది. పలువురు సన్నిహితులు, బంధువులు, గాయకులు హాజరయ్యారు.


  కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెద్దల అంగీకరాంతో పెళ్లి పీటలెక్కారు. ఆదివారం నిశ్చతార్ధం జరగ్గా, మరుసటి రోజే వివాహం చేసుకున్నారు. సంప్రదాయ రీతిలో బంధువులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. కాంచీపురం పట్టుచీరలో చిన్మయి మెరిసిపోగా, పంచెకట్టులో రాహుల్ హుందాగా కనిపించాడు.

   Singer Chinmayi weds Rahul in style

  తమ కల ఈ రోజు సాకారమైందని, కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుండడం సంతోషంగా ఉందని వధూవరులు పేర్కొన్నారు. వీరిద్దరికీ ఇండస్ట్రీ నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చిన్మయి ప్రముఖ నేపథ్య గాయనిగా దక్షిణాదిన పేరుప్రఖ్యాతులు దక్కించుకోగా, 'అందాల రాక్షసి' తదితర తెలుగు చిత్రాల్లో నటించిన రాహుల్ 'మాస్కోవిన్ కావేరి' చిత్రంతో తమిళ సినిమాలో ఆరంగేట్రం చేశాడు. చివరిగా 'వణక్కం చెన్నై' చిత్రంలో అతిథి పాత్రలో నటించాడు.

  రాహుల్ మాట్లాడుతూ.... చిన్మయిలో నాకు నచ్చింది ప్రధానంగా తన మనస్తత్వం. తనది చాలా ఓపెన్ మైండ్. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో ఒకేలా మాట్లాడుతుంది. ఎవరి గురించైనా వెంటనే ఒక నిర్ణయానికి రాదు. చాలా నిజాయితీగా ఉంటుంది. ఏ విషయాన్నీ మనసులో దాచుకోకుండా నాతో డిస్కస్ చేస్తుంది. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. చాలా తెలివైన అమ్మాయి. ఫెంటాస్టిక్ గాళ్. అందుకే నచ్చింది. నేను ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిని భార్యగా కోరుకున్నానో, అవన్నీ తనలో పరిపూర్ణంగా ఉన్నాయి. తనే నా బెటర్‌హాఫ్ అన్నారు.

  తమ వివాహం విషయమై చెప్తూ... ఈ విషయంలో మేం పెద్దగా కష్టపడలేదు. మా ఇంట్లోవాళ్లు వెంటనే ఓకే చెప్పేశారు. మాది తమిళ కుటుంబం. చిన్మయి మదర్ తమిళియనే కానీ, ఫాదర్ మాత్రం తెలుగు అన్నారు. 'ఏ మాయ చేసేవె' చిత్రంలో సమంత వాయిస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తొలి చిత్రంతో సమంతకు అంత పేరు రావడానికి ఆ వాయిస్ కూడా ప్రధాన కారణం. ఈ చిత్రంలో సమంతకు డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి.

  ఇక అందాల రాక్షసి చిత్రం ద్వారా తెలుగు హీరోగా పరిచయం అయిన రాహుల్, ఆ తర్వాత పలు చిన్న బడ్జెట్ చిత్రాల్లో నటింస్తున్నాడు. ప్రస్తుతం పెళ్లి పుస్తకం, వనక్కం చెన్నై, నేనేం చిన్న పిల్లనా చిత్రాల్లో నటిస్తున్నాడు. తెలుగులో ప్రవేశించడానికి ముందు రాహుల్ మూడు తమిళ చిత్రాల్లో నటించాడు.

  English summary
  Singer Chinmayi Sripada who shot to fame with songs like "Mast Magan" and "Titli" wed Rahul Ravindran of Andala Rakshasi fame yesterday in a grand manner. While Chinmayi sported silk saree, Rahul sported white dhoti to get married in South Indian style. Many celebrities from TOllywood and Kollywood graced the marriage and blessed the newly wed.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more