For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సింగర్ సునీత పెళ్లికి అడ్డంకి: అనుకున్నదొకటి అవుతుందొకటి.. ఈ సారి అలా ఫిక్స్!

  |

  తెలుగులో ఎన్నో పాటలు ఆలపించి బెస్ట్ సింగర్ అనిపించుకుంటున్నారు సునీత. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడిన ఆమె.. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ ఆకట్టుకున్నారు. కెరీర్ పరంగా దూసుకుపోతున్నప్పటికీ... పర్సనల్‌ లైఫ్‌ను మాత్రం చక్కగా డిజైన్ చేసుకోలేకపోయారు. ఈ కారణంగానే చాలా కాలం క్రితం తన భర్తకు దూరమయ్యారు. అప్పటి నుంచి ఆమె మరో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల తన రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సునీత. అంతలోనే ఓ షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఆ వివరాలు మీకోసం!

   సూపర్ హిట్ సాంగ్స్.. అవార్డుల పంట

  సూపర్ హిట్ సాంగ్స్.. అవార్డుల పంట

  సంగీతం మీద ఉన్న ఆసక్తితో చిన్న వయసులోనే దానికి సంబంధించిన శిక్షణను తీసుకున్నారు సునీత. 15 ఏళ్ల వయసులోనే ప్లేబ్యాక్ సింగర్‌గా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మరపురాని గీతాలను ఆలపించి ఔరా అనిపించారు. తద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అంతేకాదు, ఎన్నో అవార్డులు, పురస్కారాలను తన ఖాతాలో వేసుకున్నారామె.

  19 ఏళ్లకే పెళ్లి.. ఆమెకు ఇద్దరు పిల్లలు

  19 ఏళ్లకే పెళ్లి.. ఆమెకు ఇద్దరు పిల్లలు

  చిన్న వయసులోనే వరుస సినిమా ఆఫర్లతో బిజీ బిజీగా గడిపారు సునీత. చాలా మంది హీరోయిన్లకు గాత్రధానం కూడా చేశారు. దీంతో రెండు విధాలుగా ఆకట్టుకుంటూ ముందుకెళ్లారు. సరిగ్గా అలాంటి సమయంలోనే సునీతకు వివాహం నిశ్చయమైంది. 19 ఏళ్ల వయసులోనే ఆమె కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంటకు ఇద్దరు పిల్లలు జన్మించారు.

   భర్తతో విడాకులు... ఒంటరిగా ఉంటూ

  భర్తతో విడాకులు... ఒంటరిగా ఉంటూ

  చాలా కాలం పాటు సజావుగా సాగిన వీరి వైవాహిక జీవితానికి కొన్నేళ్ల క్రితం పుల్‌స్టాప్ పెట్టారు. వ్యక్తిగత కారణాలతో న్యాయబద్ధంగా విడాకులు తీసుకుని వీళ్లిద్దరూ దూరమైపోయారు. భర్తతో దూరమైనప్పటి నుంచి సునీత ఒంటరిగా జీవిస్తున్నారు. సినిమాల్లో పాటలు పాడుతూ.. డబ్బింగ్ చెబుతూ తన ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు. తద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

   రెండో పెళ్లిపై పుకార్లు.. ఇలా పుల్‌స్టాప్

  రెండో పెళ్లిపై పుకార్లు.. ఇలా పుల్‌స్టాప్

  భర్తతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి సునీత రెండో పెళ్లి గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలోనే ఆమె పలానా వ్యక్తిని పెళ్లాడబోతుందని కూడా గుసగుసలు వినిపించాయి. కానీ, అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు సింగర్ సునీత.

  మీడియా సంస్థ అధినేతతో వివాహం

  మీడియా సంస్థ అధినేతతో వివాహం

  ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో గాయని సునీత వివాహం సెట్ అయింది. కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఇక అందరి దృష్టి ఆమె పెళ్ళెప్పుడు అనే దానిపై పడింది. దీంతో ఒక్కొక్కరూ ఒక్కో విధమైన తేదీలతో ప్రచారం చేస్తున్నారు. ఆమె పెళ్లి ఈ నెల 27న జరిగే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది.

  సునీత పెళ్లికి అడ్డంకి.. అలా ఫిక్స్ చేసి

  సునీత పెళ్లికి అడ్డంకి.. అలా ఫిక్స్ చేసి

  సునీత - రామ్ పెళ్లి డిసెంబర్ 26న గానీ 27న గానీ జరగబోతుందని అంతా అనుకున్నారు. వాస్తవానికి ఈ నెలలోనే వీళ్లు పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. జాతకాల ప్రకారం మంచి ముహూర్తం దొరకలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే జనవరి 9 వీళ్ల జాతకాలకు సరిపడే జాతకం ఉండడంతో.. ఆరోజే పెళ్లి జరపాలని నిశ్చియించినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

  English summary
  Playback singer Sunitha is all set to enter wedlock again. Few days ago, by sharing a post on Facebook, Sunitha announced that she is going to marry Ram, who is the CEO of a digital media house. Earlier, rumors broke out that Singer Sunitha postponed her wedding but now according to the latest update the wedding date...
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X