»   » ‘బ్రహ్మోత్సవం’ లో సునీత క్యారక్టర్ ఏంటంటే

‘బ్రహ్మోత్సవం’ లో సునీత క్యారక్టర్ ఏంటంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో గాయని సునీతను కూడా నటింపజేయాలని ప్రిన్స్ కోరినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీతను కీలక పాత్రలో చూపించే విధంగా దర్శకుడు ఆ పాత్రను డిజైన్ చేశాడట. దీనికి ఆమె కూడా అంగీకారం తెలిపిందని సమాచారం. ఈ నేపధ్యంలో ఏమిటా పాత్ర అనేది ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంసంగా మారింది. ఆ పాత్ర మరేదో కాదుట...మహేష్ బాబు కు వదిన అని తెలుస్తోంది. గతంలో సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు చిత్రంలో అంజలి చేసిన పాత్రలాంటిదన్నమాట. ఆ పాత్ర సినిమాలో చాలా కీలకమై ఉంటుంది అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సింగర్‌గా కొన్ని వందల సినిమాలకు తన గానాన్ని అందించిన సునీత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించింది. 1995లో ‘గులాబి' చిత్రంతో సింగర్ గా పరిచయమైన సునీత సుమారు 750 చిత్రాలకు పైగా తన సుమధుర గొంతుతో డబ్బింగ్ చెప్పింది. ఆమె పాటలకు అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. గతంలో సునీతకు ఎన్నో చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా అంగీకరించలేదు.

Singer Sunitha’s role in ‘Brahmotsavam

ముఖ్యంగా శేఖర్ కమ్ముల సినిమాలో నటింపచేసేందుకు ఆయన ఎంతగా ప్రయత్నించిన ఒప్పుకోలేదు...కానీ ఆ (అనామిక) చిత్రంలో ప్రమోషనల్ సాంగ్ చేసింది. ప్రముఖ ఛానెల్‌లో పలు మ్యూజికల్ కార్యక్రమాలకు, కొన్ని ప్రైవేటు ఈవెంట్స్‌లో యాంకర్‌గా కనిపించిన సునీత కంటిన్యూగా ఇక సినిమాలో కూడా చూడవచ్చేమో.

మహేష్‌బాబు కంటిన్యూగా మూడు నెలలు పాటు అంటే 90 రోజుల పాటు కాల్ షీట్స్ ని శ్రీకాంత్ అడ్డాల చిత్రం కోసం ఎలాట్ చేసినట్లు సమచారం. తూర్పు గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో కథ జరుగుతుందని, అక్కడ కొన్ని సీన్స్ తీస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే...

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' సినిమాలో నటించటానికి కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే 31న అంటే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజున ప్రారంభం కానుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. దర్శకుడు ఇప్పటికే స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసి ఓ వెర్షన్ వినిపించి గ్రీన్ సిగ్నల్ పొందాడని తెలుస్తోంది.

Singer Sunitha’s role in ‘Brahmotsavam

గతంలో మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం' రూపొందుతూండటంతో బిజినెస్ కూడా బాగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

అయితే పి.వి.పి సంస్థ ఈ సినిమా కోసం కాస్టింగ్‌ కాల్‌ ఇచ్చింది. ఈ చిత్రంలో నటించడానికి 15 నుంచి 50 సంవత్సరాల వయస్సులోపు మేల్‌, ఫీమేల్‌ ఆర్టిస్టులు కావాలని ప్రకటించారు. ఆసక్తి కలవారు ఫుల్ సైజ్, క్లోజప్ ఫోటోతో కాంటాక్ట్ చేయాల్సిందిగా ప్రకటించారు. పైన ఫొటోలో ఉన్న మెయిల్ ఐ.డికి ఫోటోలు పంపించవచ్చు. ఈ సినిమా మహేష్ బాబుతోనే అయితే... తనతో తెరపంచుకునే అవకాశం కొత్త వారికి కలుగుతుంది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం'. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘బ్రహ్మోత్సవం'లో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. వాటిని చిత్ర బృందం ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటించనున్నారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

English summary
Suneetha has been getting ready to appear in Mahesh’s next film Brahmotsavam under Srikanth Addala direction. As per some sources is gossiped of debuting on big screen by obliging the character of hero Mahesh Babu’s Vadina in the flick.
Please Wait while comments are loading...