»   »  ‘సెకండ్ హ్యాండ్’తో సోనాక్షి సిన్హా ఎంగేజ్‌మెంట్

‘సెకండ్ హ్యాండ్’తో సోనాక్షి సిన్హా ఎంగేజ్‌మెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా ఎంగేజ్‌మెంట్ ఫిబ్రవరిలో జరుగుతుందట. ఆమె ఎంగేజ్‌మెంట్‌కు సల్మాన్‌ఖాన్‌కు సంబంధమేమిటని అనుకుంటున్నారా? ప్రస్తుతం సోనాక్షి సిన్హా డేటింగ్ చేస్తున్న బంటీ సజ్‌దేహ్ సల్మాన్ ఖాన్‌కు సమీప బంధువు.

బంటీ సల్మాన్ ఖాన్ కు బావ మరిది వరుస అవుతారు. ఎలా అంటే సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ భార్య సీమాఖాన్ కు బంటీ స్వయానా తమ్ముడు.

Sonakshi Sinha engagement in February?

అయితే అంబికా చౌహాన్ అనే సెలబ్రిటీతో బంటీకి వివాహమైంది. నాలుగేండ్ల దాంపత్య జీవితం తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకొన్నారు. కానీ దియామీర్జా, ఇతర బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

ఇటీవల బంటీ, సోనాక్షి సిన్హా అన్యోన్యంగా చెట్టాపట్టాల్ వేసుకొని పలు కార్యక్రమాల్లో కనిపించడం కూడా నిశ్చితార్థ కార్యక్రమానికి బలం చేకూరుస్తున్నది. అంతేకాకుండా బంటీ కుటుంబంతో సోనాక్షికి సన్నిహిత సంబంధాలున్నాయి.

Sonakshi Sinha engagement in February?

ఈ నేపథ్యంలో బంటీ చేసిన పెండ్లి ప్రతిపాదనకు సోనాక్షి ఓకే చెప్పారని, దాంతో ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరుగనున్నదనే రూమర్ బాలీవుడ్‌లో కోడైకూస్తున్నది. ఈ వ్యవహారంపై సోనాక్షి స్పందించి వివరణ ఇస్తే తప్ప అసలు విషయమేమిటో బయటకు తెలియదు.

English summary
Dabangg actress Sonakshi Sinha and her beau Bunty Sajdeh rumoured to exchange rings in 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu