38 ఏళ్లకి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్!.. బేబీ బంప్ ఫొటోలు వైరల్..
సినీ ప్రపంచంలో నటీనటుల వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ప్రజల దృష్టిలో ఉంటాయి. వాళ్లు ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎక్కడికైనా వెళ్లినా ఆ వార్తలు క్షణాల్లో వైరల్ అవుతాయి. అందుకే సినీ తారల జీవితం అంటే సాధారణంగా అభిమానులకు ఒక కుతూహలం, ఆసక్తి, ఉత్సాహం కలిగించే అంశం. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే వారి పెళ్లి, ప్రెగ్నెన్సీ, కుటుంబ జీవితం వంటి విషయాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చలకు దారితీస్తాయి. తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఓ స్టార్ హీరోయిన్. ఈ మధ్యకాలంలో కాస్త వదులుగా ఉంటే దుస్తువులు వేసుకోవడంతో తల్లి కాబోతుందా? అనే రూమర్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?
ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. ప్రస్తుతం కెరీర్‌లో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ఇప్పటివరకు హిందీ సినిమాలతోనే తన మార్క్ వేసిన ఈ అందాలతార, ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. హీరో సుధీర్ బాబు నటిస్తున్న 'జటాధర' సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో సోనాక్షి విలన్ లాంటి షేడ్స్ ఉన్న రోల్‌లో నటించనుందని సమాచారం. ఇటీవలే మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, "ధన పిశాచి" పేరుతో విడుదలైన స్పెషల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. సోనాక్షి ఆ లుక్‌లో సీరియస్ గ్లామర్‌తో మంత్ర ముగ్ధులను చేసింది.

సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నప్పటికీ, సోనాక్షి ప్రస్తుతం వ్యక్తిగత జీవితంతో కూడా వార్తల్లో నిలుస్తోంది. గతేడాది ఆమె తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను ప్రత్యేక వివాహం చేసుకుంది. అప్పట్లో బాలీవుడ్ లో ఓ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత నుంచి సోనాక్షిపై గర్భవతి అంటూ వచ్చిన రూమర్లు అప్పుడప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఆ రూమర్లు మళ్లీ తెరపైకి వచ్చాయి.
ఇటీవల సోనాక్షి-జహీర్ జంట డిజైనర్ విక్రం ఫడ్నిస్ 35 ఏళ్ల ఫ్యాషన్ జర్నీ సందర్భంగా ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. "Vintage India" థీమ్‌తో సాగిన ఈ ఫ్యాషన్ షోలో 100 మంది మోడల్స్ ర్యాంప్‌పై నడిచారు. ఈ వేడుకలో సోనాక్షి రెడ్ కలర్ అనార్కలి డ్రెస్‌లో మెరిసి అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమె వదులుగా ఉండే దుస్తులు ధరించడం, అలాగే ఫోటోలకు పోజులిస్తూనే చేతితో పొట్టను కప్పుకోవడం అభిమానుల కంటపడ్డాయి. దాంతో సోషల్ మీడియాలో "సోనాక్షి గర్భవతా?" అన్న చర్చ మొదలైంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కావడంతో సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే ఆమె ఫోటోలు చూసి ఏకంగా " కాంగ్రాట్స్ సోనాక్షి!"అంటూ శుభాకాంక్షలు కూడా చెప్పారు. అయితే ఈ వార్తలపై సోనాక్షి లేదా జహీర్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో ఇలాంటి రూమర్లు వచ్చినప్పుడు సోనాక్షి హాస్యంగా స్పందించింది. "నేను గర్భవతి కాదు, పెళ్లి తర్వాత బరువు పెరిగాను అంతే!" అంటూ సరదాగా చెప్పింది. అంతేకాదు, జహీర్ తనను ఎక్కువగా తినిపించాడని సరదాగా వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది.
ఆ ఈవెంట్‌లో జహీర్ ఇక్బాల్ కూడా నేవీ బ్లూ బంధగల సూట్‌లో ఆకట్టుకున్నారు. సోనాక్షి పక్కన నిలబడి మీడియాకు పోజులు ఇచ్చారు. ఇద్దరూ కలిసి ర్యాంప్ వైపు నడుస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఇక వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ సోనాక్షి ఒక ఇంటర్వ్యూలో, "మేము మతం గురించి కాదు, ప్రేమ గురించి ఆలోచించాం. అతను తన మతాన్ని నాపై రుద్దడం లేదు, నేనూ నా మతాన్ని అతనిపై రుద్దడం లేదు. మేము ఒకరినొకరు గౌరవించి, రెండు సంస్కృతులను సంతోషంగా జరుపుకుంటున్నాం," అని తెలిపింది. ప్రస్తుతం సోనాక్షి, జహీర్ ముంబైలో నివసిస్తూ తమ వివాహజీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నారు. అయితే ఈ తాజా ఈవెంట్ వీడియోలతో "సోనాక్షి ప్రెగ్నెంట్?" అనే రూమర్లు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులు మాత్రం ఆమె నుంచి క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











