twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రీమేక్ కి రవితేజ అంటున్నారు...ఒప్పుకుంటాడా

    By Srikanya
    |

    హైదరాబాద్ : రవితేజ తన కెరీర్ లో రీమేక్ లు చేసినవి తక్కువనే చెప్పాలి. ఆయన సూపర్ హిట్లే ఇతరభాషల్లోకి రీమేక్ అయ్యి విజయం సాధించాయి. ఈ నేపధ్యంలో రీసెంట్ గా ఆయన్ను నేషనల్ అవార్డు విన్నింగ్ హిందీ చిత్రం ‘ స్పెషల్ ఛబ్బీస్ 26′ రీమేక్ కు అడగనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని నటుడు, దర్శకుడు అయిన త్యాగరాజన్ పొందారు. ఆయనే డైరక్ట్ చేయనున్నారు. అయితే ఈ విషయమై రవితేజ వద్ద ప్రపోజల్ పెట్టనున్నారని తమిళ వర్గాల సమాచారం. అయితే రవితేజ ఒప్పుకుంటాడా లేదా అన్నిది ఇప్పుడు టాలీవుడ్ వాసుల్లో నలుగుతున్న ప్రశ్న.

    త్యాగరాజన్ మాట్లాడుతూ... " నేను హిందీలో విజయవంతమైన స్పెషల్ 26 రైట్స్ తీసుకున్నాను. ఆ గోల్డన్ ఆపర్చునిటీ నాకే దక్కింది. సౌత్ లోని నాలుగు భాషల రైట్స్ నా దగ్గరే ఉన్నాయి. నేనే ఈ చిత్రాన్ని స్వయంగా డైరక్ట్ చేస్తాను ". అన్నారు. ఇక త్యాగరాజన్ గతంలో కంగన రనత్ హీరోయిన్ గా వచ్చిన క్వీన్ చిత్రం రీమేక్ రైట్స్ సైతం తీసుకుని ఇప్పటివరకూ మొదలుపెట్టని సంగతి తెలిసిందే.

    గతంలో ‘స్పెషల్ ఛబ్బీస్' చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్ దర్శకుడు ఎన్.లింగుస్వామి స్వంతం చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా తానే నిర్మాతగా స్వీయ దర్శకత్వంలో కమల్‌హాసన్‌తో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సంకల్పించారు. విశ్వరూపం సీక్వెల్ పూర్తయిన తరువాత ఈ చిత్రంలో కమల్ నటించనున్నారని అన్నారు అయితే ఇది క్రియారూపం దాల్చలేదు. ఈ లోగా ఏం జరిగిందో ఏమో త్యాగరాజన్ ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. లింగు స్వామి నుంచి తీసుకుని ఉండవచ్చు అంటన్నారు.

    ఈ సినిమా హిందీలో కమర్షియల్ గా సక్సెస్ కావడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా 80లలో కొంతమంది నకిలీ సి.బి.ఐ ఆఫీసర్లుగా బొంబాయిలోని ఒక నగల షాపుని దోచుకున్న యాదార్త సంఘటనల ఆధారంగా రూపొందింది.

    ‘Special 26’ to be remade in Telugu

    మార్చి 19, 1987లో ఒక అజ్ఞాత వ్యక్తి తాను సీబీఐ అధికారినని నమ్మబలికి 26 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారుల బృందంతో ఒపెరా హౌజ్‌లోని త్రిభువన్‌దాస్‌ జవేరీ నగల దుకాణంలో లక్షలాది విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటనను తెరకెక్కించారు. నకిలీ ఐటీ అధికారుల పేరుతో ఇటీవలి సంఘటనల ఆధారంగా దర్శకుడు నీరజ్‌ పాండే ఈ సినిమాను తీసారు. రియా చౌహాన్‌ అనే ఒక ఉపాధ్యాయిని పాత్రలో కాజల్ కనిపించింది.

    కథగా చెప్పాలంటే...ఇది 1987 నాటి కథాంశం. అక్షయ్‌ కుమార్‌ మోసం చేయటంలో నెంబర్‌ వన్‌. అతడి గ్యాంగ్‌లో మరోముగ్గురు. వీరి టార్గెట్‌ రాజకీయ నాయ కులు, బ్లాక్‌మనీ అధికారులు, వ్యాపారవేత్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరీ వద్ద బ్లాక్‌మనీ ఉంటే నకిలీ సిబిఐ అధికారులుగా అక్కడ వాలుతారు. నిలువు దోపిడీ చేస్తారు. వీరికి ఇన్‌స్పెక్టర్‌ తోడ్పడతాడు. అసలైన సిబిఐ ఆఫీసర్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌ వీళ్లను పట్టడానికి ప్లాన్‌ మీద ప్లాన్లు వేస్తాడు. వీరి ఆఖరి టార్గెట్‌ బొంబాయిలోని జ్యూయెలరీ షాప్‌. సిబిఐ ఆఫీసర్‌ పక్కా ప్లాన్‌ చేస్తాడు ఈసారి ఎలాగైనా అక్షయ్‌ని పట్టుకోవాలని. చివరికి నేరస్తుడు దొరికాడా? లేదా? అన్నదే క్లైమాక్స్‌. ఈ సినిమాకు సంగీత దర్శకులు చందన్‌ శర్మ, హిమేష్‌ రేష్‌మ్మియా, ఎం.ఎం. కీరవాణి. క్రైం కథని సీరియస్‌గా నడిపించాడు. అక్షయ్‌కుమార్‌, అనుపమ్‌ఖేర్‌, కాజల్‌ బాగా చేశారు.

    English summary
    ‘Special 26′ which released in 2013, will now be remade in Telugu. Actor, director Thiagarajan has grabbed the remake rights of this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X