»   » బాలకృష్ణ కోసం స్పెషల్ బైక్

బాలకృష్ణ కోసం స్పెషల్ బైక్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : బాలకృష్ణ ఓ స్పెషల్ బైక్ పై కనిపించి ఫ్యాన్స్ ని అలరించనున్నారు. బాలకృష్ణ ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కున్న సినిమా కోసం ఈ బైక్ ని సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాలోని బాలకృష్ణ పాత్ర కోసం ఓ స్పెషల్ బైక్ ని సిద్దం చేసారు. ఈ బైక్ తయారీ కోసం స్పెషల్ డిజైనర్స్ ని పిలిపించారు. ఈ బైక్ పై కస్టం పెయింటింగ్స్ మరియు స్టైలిష్ చక్రాలు ఉండనున్నాయి.

ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాని సాయి కొర్రపాటి - 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని మరో హీరోయిన్ కోసం ఈ చిత్ర నిర్మాతలు అన్వేషిస్తున్నారు. అలాగే ఈ సినిమా 2014 ప్రారంభంలో ఈ చిత్రం విడుదల అవుతున్నారు.

సింహా లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే అంచనా అభిమానుల్లో ఉండటం సహజం. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు.

అలాగే బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు, అభిమానులూ ఏం కోరుకొంటారో అవన్నీ మేళవిస్తూ.. ఆయన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ అంశాలూ ఉంటాయా? అని అందరూ అడుగుతున్నారు. అవీ ఉంటాయి. కానీ.. కథకు ఎంత వరకూ అవసరమో అంతే. ఆ గీత దాటి బయటకు వెళ్లవు అన్నారు. బాలకృష్ణగార్ని దృష్టిలో పెట్టుకొని చేసిన కథ ఇది. ఏ సినిమాకైనా టిక్కెట్ తెగేది హీరోని చూసే. 50, 60 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే అది హీరోని చూసే. అందుకే నా సినిమాల్లో హీరోని వేరే ఏ ఇతర పాత్రలూ డామినేట్ చేయనివ్వను. నా సినిమాల్లో నా హీరోనే హైలైట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. నేను ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి అభిమానిని అని భావిస్తా. అప్పుడే ఓ అభిమాని ఆ హీరో నుంచి ఏమేం ఎదురు చూస్తున్నాడో అవన్నీ చేయగలుగుతా అన్నారు..

English summary
Balakrishna and Boyapati Sreenu have teamed up for a new movie.For Balakrishna’s character in the film, a special bike is being readied. Special designers have been flown in for this purpose. The bike is going to have a custom paint scheme and stylish wheels.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu