For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అక్కినేని కుటుంబంలో ప్రత్యేక వేడుక.. స్పెయిన్‌లో రెండు రోజులు.. ప్రముఖులకే ఆహ్వానం

  |

  పేరుకు సీనియర్ హీరోనే అయినా అందంలో కుర్రాళ్లతో పోటీ పడుతున్నాడు అక్కినేని నాగార్జున. కేవలం ఆ విషయంలోనే కాదు.. సినిమాలు చేయడంలోనూ.. వ్యాపార ప్రకటనలు.. టీవీ షోలు ఇలా అన్నింటిలోనూ ఆయన టాలీవుడ్ హీరోలు అందరికంటే ముందే ఉన్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాగే, బుల్లితెరపైనా కొన్ని షోలతో మెప్పిస్తున్నాడు. ఇటీవలే 'బిగ్ బాస్' రియాలిటీ షో సీజన్ -3కి హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఓ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

  అక్కినేని ఫ్యామిలీ స్పెషల్

  అక్కినేని ఫ్యామిలీ స్పెషల్

  సినీ ఇండస్ట్రీలో చాలా ఫ్యామిలీలు ఉన్నాయి. వీటిలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. నాగేశ్వర్రావు బ్రతికున్నప్పుడు కొడుకులు, కూతుళ్లు ప్రతి ఆదివారం తన ఇంటికి రావాలని ఆయన కండీషన్ పెట్టారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అందరూ ఆరోజు పెద్దాయన ఇంట్లో వాలిపోయేవారు. ఈ విషయాన్ని నాగార్జున కూడా ఇటీవల చెప్పారు.

  మళ్లీ కలవబోతున్నారు

  మళ్లీ కలవబోతున్నారు

  నాగ చైతన్య - సమంత వివాహం సమయంలో అక్కినేని కుటుంబం అంతా కలిసింది. ఆ తర్వాత వీరంతా అప్పుడప్పుడూ కలుసుకున్నా.. ప్రత్యేకించి అందరూ హాజరవ్వలేదట. కానీ, ఈ కుటుంబంలోని సభ్యులంతా మరోసారి కలవబోతున్నారట. అది ఎందుకు..? ఎక్కడ..? అనే కదా మీ సందేహం. వీళ్లంతా కలిసేది ఓ ప్రత్యేక వేడుకలోనని తెలుస్తోంది.

  నాగార్జున జీవితంలో ప్రత్యేక రోజు

  నాగార్జున జీవితంలో ప్రత్యేక రోజు

  నాగ్ ఈ నెల 29న 60వ పడిలోకి అడుగు పెట్టనున్నాడు. అంటే ఆయన జీవితంలో ఇదో ప్రత్యేక రోజు. అంటే నాగార్జున షష్టిపూర్తి చేసుకునే సమయం. అవును.. దంపతులలో భర్తకు ఆరు పదులు వయసు నిండినప్పుడు జరుపుకొను వేడుక లేదా ఉత్సవాలను షష్టిపూర్తి అని అంటారు. ఇదే వేడుకను నాగార్జున - అమల చేసుకోబోతున్నారని ఓ వార్త బయటకు వచ్చింది.

   వాళ్లే ప్లాన్ చేశారట

  వాళ్లే ప్లాన్ చేశారట

  ఈ వేడుకలను ఘనంగా చేయాలని ఆయన కుమారుడు అఖిల్, నాగ చైతన్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తన తండ్రిని స్పెయిన్ తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు, అక్కడ రెండు రోజుల పాటు ఈ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ వేడుకలకు కొందరు ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందనుందని టాక్.

  ‘మన్మథుడు 2' గురించి..

  ‘మన్మథుడు 2' గురించి..

  అక్కినేని నాగార్జున - గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘మన్మథుడు 2'. మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్‌, రావు రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు. ఈ సినిమా రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

  English summary
  Tollywood Senior Hero Nagarjuna is turning 60 on August 29th this year. The actor will be celebrating this occasion which was planned especially to make it a memorable one. Chaitu and Akhil planned Nag’s 60th birthday in Ibiza, Spain.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X