For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ChaySam Divorce: పెళ్లికి ముందే సమంత చైతూ మధ్య ఒప్పందం.. విడిపోయిన తర్వాత అలా చేయకూడదంటూ!

  |

  కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం అవుతోన్న విషయాల్లో అక్కినేని నాగ చైతన్య.. సమంత విడాకుల వార్త ఒకటి. చాలా కాలం పాటు ప్రేమలో ముగిని తేలిన ఈ జంట.. కొన్నేళ్ల క్రితం అగ్నిసాక్షిగా ఒక్కటైంది. వివాహ బంధం మొదలైన తర్వాత నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చారీ ఇద్దరు. అయితే, కొద్ది రోజులుగా ఈ జంట మధ్య దూరం పెరిగిందని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో సమంతకు అక్కినేని కుటుంబం నుంచి భరణం కూడా ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  ఇలాంటి పరిస్థితుల్లో శనివారమే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే వీళ్లిద్దరి మధ్య ఓ విషయంలో ఒప్పందం జరిగిందని తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఆ సంగతులు మీకోసం!

  అప్పుడే మొదలైన ప్రేమ.. పెళ్లి చేసుకుని

  అప్పుడే మొదలైన ప్రేమ.. పెళ్లి చేసుకుని

  అక్కినేని నాగ చైతన్య.. సమంత కలిసి 'ఏమాయ చేశావే' సినిమా చేశారు. అప్పుడు ఆడిషన్స్ కోసం ఆమె ఫొటోను తొలిసారి చూశాడట. అప్పుడే ఆమెకు మనోడు ఫ్లాట్ అయిపోయాడు. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. 'ఆటోనగర్ సూర్య' సినిమా చేసిన టైమ్‌లో ప్రేమలో పడ్డారు.

  అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించారు. ఆ తర్వాత నాగ చైతన్య, సమంత 'మనం' సినిమా సమయంలో నాగార్జునకు ఈ విషయాన్ని చెప్పారు. దీనికి అందరూ ఒప్పుకోవడంతో ఆ తర్వాత ఈ సినీ జంట అగ్నిసాక్షిగా ఒక్కటైంది.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  పెళ్లి తర్వాత జంటగా రచ్చ... కెరీర్ కూడా

  పెళ్లి తర్వాత జంటగా రచ్చ... కెరీర్ కూడా

  వివాహం చేసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం వంటివి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ వచ్చారు. అదే సమయంలో ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగ చైతన్య - సమంత కలిసి 'మజిలీ' అనే మూవీ చేశారు. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీనితో పాటు ఇద్దరూ కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటూ వస్తున్నారు.

  అప్పుడలా.. ఇప్పుడిలా పేరు మార్చేసింది

  అప్పుడలా.. ఇప్పుడిలా పేరు మార్చేసింది

  సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లికి ముందు సమంత రూత్‌ప్రభు అని ఉన్న పేరును.. ఆ తర్వాత అక్కినేని సమంత అని మార్చుకుంది. అయితే, ఈ మధ్య ఆమె తన సామాజిక మాధ్యమాల్లో అక్కినేని సమంత అని ఉండే పేరును S అని మార్చుకుంది.

  దీంతో అందరిలోనూ నాగ చైతన్యతో ఆమె విడిపోతుందన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. అప్పటి నుంచి వరుసగా ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. కానీ, వీళ్లు మాత్రం ఆ విషయంలో ఎంతో గుట్టుగానే ఉంటూ వచ్చారు.

  బికినీ ఫొటో అడిగిన కుర్రాడికి అనుపమ ఆఫర్: అడ్రెస్ పంపమంటూ లైవ్‌లోనే ఊహించని విధంగా!

  విడాకులు ప్రకటించిన సమంత, చైతన్య

  విడాకులు ప్రకటించిన సమంత, చైతన్య

  చాలా రోజులుగా వస్తున్న వార్తలకు అనుగుణంగానే తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అక్కినేని నాగ చైతన్య - సమంత విడాకులు తీసుకున్నారు. తద్వారా నాలుగేళ్ల తమ వివాహ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు. తామిద్దరం విడాకులు తీసుకోనున్నట్లు చైతన్య, సమంత శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతేకాదు, ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో వీళ్ల విడాకుల న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతోంది.

  ఎన్నో అనుమానాలు... ఏమీ మాట్లాడొద్దని

  ఎన్నో అనుమానాలు... ఏమీ మాట్లాడొద్దని

  అక్కినేని నాగ చైతన్య.. సమంత విడాకులు తీసుకుంటున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్లు దీన్ని నిజం చేసేశారు. దీంతో అసలు వీళ్లిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు? దీని వెనుక కారణాలు ఏంటి? వీళ్లిద్దరి మధ్య ఏ విషయాల్లో మనస్పర్థలు వచ్చాయి? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, దీనిపై అక్కినేని ఫ్యామిలీ మాత్రం చాలా సైలెంట్‌గా ఉంది. మరీ ముఖ్యంగా నాగార్జున పర్సనల్ విషయాలను తరచూ ప్రస్తావించకండి అంటూ అందరినీ వేడుకున్నాడు. కానీ, డౌట్లు మాత్రం ఎక్కువవుతూ ఉన్నాయి.

  హాట్ హాట్‌గా రెచ్చిపోయిన మంచు లక్ష్మి: తొలిసారి అందాలన్నీ కనిపించేలా ఘాటు ఫోజులు

  సమంతకు భరణం... ప్రస్తుతం ఇదే చర్చ

  సమంతకు భరణం... ప్రస్తుతం ఇదే చర్చ

  విడాకులు తీసుకునే సమయంలో భర్తను భార్య కోరే ఆర్థిక పరమైన మొత్తాన్నే భరణం అంటారు. విడిపోయే సమయంలో ఇలాంటివి డిమాండ్ చేయడం సర్వసాధారణమే. గతంలో చాలా మంది సినీ జంటలు కూడా ఈ భరణం తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కినేని నాగ చైతన్య.. సమంత విడిపోగానే ఈ విషయం తెరపైకి వచ్చింది. దీంతో అందరూ దీని గురించే తెగ చర్చించుకుంటున్నారు. మరికొందరైతే సామ్‌కు చైతూ ఏకంగా రూ. 300 కోట్లు చెల్లిస్తున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కినేని అభిమానుల్లో అయోమయం కనిపిస్తోంది.

  పెళ్లికి ముందే ఆ విషయంలో ఒప్పందం

  పెళ్లికి ముందే ఆ విషయంలో ఒప్పందం

  సమంత, నాగ చైతన్య విడాకులు ప్రకటించిన తర్వాత ఓ న్యూస్ ఫిల్మ్ నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. పెళ్లి చేసుకోడానికి ముందే వీళ్లిద్దరి మధ్య ఓ ఒప్పందం జరిగిందట. దీని ప్రకారం.. భవిష్యత్‌లో ఒకవేళ విడిపోవాల్సి వస్తే.. నాగ చైతన్య నుంచి సమంత భరణం ఆశించనని చెప్పిందట. అలాగే, సామ్ నుంచి చైతూ ఆర్థికపరమైన సహకారాన్ని కూడా తీసుకోనని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు విడాకులు తీసుకున్నారని సమాచారం. అంటే ఎవరూ ఎవరికీ ఎంతా ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది.

  English summary
  Samantha Akkineni and Naga Chaitanya Recently Announced about Divorce. Latest Buzz is That.. Samantha and Naga Chaitanya Did Special Promise Before Marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X